BigTV English

Chandrababu : అరకు కాఫీని నేనే పరిచయం చేశా.. ఇక్కడ పంటలకు మద్దతు ధర చెల్లించాలి..

Chandrababu : అరకులో ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎన్నో రకాలు కాఫీలు ఉన్నా అరకు కాఫీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోస్‌లో కూడా అరకు కాఫీని పరిచయం చేశాం అని ఆయన గుర్తు చేశారు. నమ్మించి ప్రజలను జగన్ మోసం చేశాడు అని ఆరోపించారు. నిత్యవసర ధరలు అడ్డగోలుగా పెంచి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు.

Chandrababu : అరకు కాఫీని నేనే పరిచయం చేశా.. ఇక్కడ పంటలకు మద్దతు ధర చెల్లించాలి..
Chandrababu

Chandrababu : అరకులో ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలన్నారు. ప్రపంచంలో ఎన్నో రకాలు కాఫీలు ఉన్నా అరకు కాఫీకి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోస్‌లో కూడా అరకు కాఫీని పరిచయం చేశామని గుర్తు చేశారు. ప్రకృతి రమణీయతకు మారు పేరు అరకు అని పేర్కొన్నారు. అయితే అరకు‌లో పండే పంటలకు సరైన మద్దతు ధర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.


నమ్మించి ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. నిత్యవసర ధరలు అడ్డగోలుగా పెంచి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. బటన్ నొక్కడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శలు గుప్పించారు. గిరిజన పిల్లలు చదువుకోవడం జగన్‌కి ఇష్టం లేదన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం గంజాయిని పరిచయం చేసిందని విమర్శించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.


Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×