E-Paper
Advertisement

Shubman Gill: WTC ఫైనల్‌లో టాస్ గెలుస్తాం

Shubman Gill: WTC ఫైనల్‌లో టాస్ గెలుస్తాం
Advertisement

Shubman Gill: కొన్ని విషయాలలో కొందరికి దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ వాటిని ఓవర్ కమ్ చేసి.. మొదటిసారి విజయం సాధిస్తే ఆ కిక్కు వేరే ఉంటుంది. అలాంటి ఘటనే టీమిండియా యంగ్ ప్లేయర్, టెస్ట్ కెప్టెన్ గిల్ విషయంలో జరుగుతుంది. గిల్ కి ఓ బ్యాడ్ లక్ కొనసాగుతుంది. బ్యాటర్ గా అతడు అత్యుత్తమంగా ఆడుతున్నప్పటికీ.. కెప్టెన్సీలో అదరగొడుతున్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు.

Also Read: Temba Bavuma – Pant: తెంబా బ‌వుమా ఓ మ‌ర‌గుజ్జుగాడు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన పంత్‌

Advertisement

కెప్టెన్ గా గిల్ టాస్ గెలవడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. ఈ ఏడాది జూన్ లో టెస్ట్ కెప్టెన్ గా గిల్ ఎంపిక అయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు 11 మ్యాచ్ లలో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో తొలిసారి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్.. తన తొలి టెస్ట్ సిరీస్ ని డ్రా గా ముగించాడు.

తొలిసారి టాస్ గెలిచిన గిల్:

ఆ తర్వాత వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ జరిగింది. స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన ఈ సిరీస్ లో రెండవ టెస్టులో మాత్రమే ఒక్కసారి టాస్ గెలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో భారత్ రెండవ టెస్టులో తలపడింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓ వింతైన రికార్డు బ్రేక్ అయింది. అభిమానుల ఎదురు చూపులకు పుల్ స్టాప్ పడింది. వరుసగా 6 టెస్టుల్లో టాస్ ఓడిపోయిన గిల్.. ఏడవ టెస్ట్ లో టాస్ గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ టాస్ గెలిచింది లేదు. అయితే నేడు భారత్ – దక్షిణాఫ్రికా మధ్య కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లోను మరోసారి టాస్ ఓడిపోయాడు గిల్. ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి.. టాస్ ఓడిపోవడం పై గిల్ ని ప్రశ్నించాడు. రవి శాస్త్రి అడిగిన ప్రశ్నకు గిల్ నిరాశగా సమాధానం ఇచ్చాడు. దీంతో గిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

WTC ఫైనల్ లో టాస్ గెలుస్తానేమో..?

Advertisement

టాస్ ఓడిపోయిన అనంతరం గిల్ మాట్లాడుతూ.. “నేను గెలవబోయే ఏకైక టాస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోనే అనుకుంటా. ఇక ఈ పిచ్ చూడడానికి బాగా కనిపిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో స్వింగ్ లభిస్తుందని అనుకుంటున్న. దాన్ని క్యాష్ చేసుకుంటాం. డ్రెస్సింగ్ రూమ్ అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం మా ఆటగాళ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Shardul Thakur: ఒక‌టి కాదు, రెండు కాదు.. 8 జ‌ట్లు మారిన ఏకైక ఆట‌గాడు

మేము ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం. ఈ టెస్ట్ సిరీస్ చాలా కీలకమైంది” అని చెప్పుకొచ్చాడు. మరోవైపు వన్డే కెప్టెన్ అయిన తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో కూడా మూడు వన్డేల్లో టాస్ ఓడిపోయిన ఈ యువ కెప్టెన్.. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లోను టాస్ గెలవలేకపోవడంతో కాస్త నిరాశ చెందినట్లు కనిపించాడు.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×