E-Paper
Advertisement

Ind vs SA 2nd T20I: ఎట్ట‌కేల‌కు టాస్ గెలిచిన టీమిండియా..జ‌ట్టులోంచి గిల్ ను తొల‌గించాలంటూ ట్రోలింగ్

Ind vs SA 2nd T20I: ఎట్ట‌కేల‌కు టాస్ గెలిచిన టీమిండియా..జ‌ట్టులోంచి గిల్ ను తొల‌గించాలంటూ ట్రోలింగ్
Advertisement

Ind vs SA 2nd T20I: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా (India vs South Africa ) మధ్య ప్రస్తుతం టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టులతో పాటు వన్డేలు పూర్తయ్యాయి. మొన్న డిసెంబర్ 9వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభమైంది. ఇందులో మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ రెండో టి20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

సూర్య కుమార్‌, గిల్ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఫ్యాన్స్ సీరియ‌స్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd T20I) మధ్య ఇవాళ రెండవ టి20 జరగనుంది. ఈ మ్యాచ్ చండీగర్ లోని ముల్లన్‌పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Maharaja Yadavindra Singh International Cricket Stadium, Mullanpur, New Chandigarh) వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగియగా ఏడు గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ ప్రసారాలు ఉచితంగానే తిలకించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ టి20 సిరీస్ ప్రసారాలు వస్తున్నాయి.

అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మొన్న అత్యంత దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ పైన అందరి ఫోకస్ ఉంది. గత కొన్ని మ్యాచ్లుగా ఈ ఇద్దరు ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు. ఇవాళ అయినా వీళ్లు రాణిస్తారా? చేతులెత్తేస్తారా? అనే ఉత్కంఠత అందరిలోనూ ఉంది.  అయితే, చాలా రోజుల నుంచి పెద్ద‌గా రాణించ‌ని గిల్ పై ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అత‌న్ని జ‌ట్టులోంచి గిల్ ను తొల‌గించాలంటూ ఫైర్ అవుతున్నారు. గిల్ స్థానంలో సంజును తీసుకోవాల‌ని కోరుతున్నారు అభిమానులు. ఇక మొదటి టి20 మ్యాచ్ గెలిచిన నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది టీమిండియా.

Advertisement

 

Also Read: ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

ఇరు జ‌ట్ల వివ‌రాలు ఇవే

టీమిండియా (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, లుథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×