E-Paper
Advertisement

IND vs SA, 2nd Test: ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌..గిల్ కు నో ఛాన్స్‌..తెలుగోడు వ‌స్తున్నాడు..తుది జ‌ట్టు ఇదే

IND vs SA, 2nd Test: ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌..గిల్ కు నో ఛాన్స్‌..తెలుగోడు వ‌స్తున్నాడు..తుది జ‌ట్టు ఇదే
Advertisement

IND vs SA, 2nd Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తప్పక గెలవాల్సిన టీమిండియా చేజేతులా మ్యాచ్ పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ లో కేవలం 30 ప‌రుగుల‌ తేడాతో టీమ్ ఇండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. అయితే నవంబర్ 22వ తేదీ అంటే మరో నాలుగు రోజుల్లోనే ఈ రెండు జట్ల మధ్య మరో టెస్ట్ ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా ఈ రెండు టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో గిల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

గిల్ ఔట్..నితీష్ కుమార్ కు ఛాన్స్ ?

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 22వ తేదీ నుంచి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం ( Barsapara Cricket Stadium, Guwahati ) వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ దూరంగా ఉన్నాడు. మొదటి టెస్ట్ సందర్భంగా మెడ నొప్పితో గాయపడిన గిల్ రెస్ట్ మూడ్ లో ఉన్నాడు. అయితే, మెడనొప్పి కారణంగా రెండో టెస్టుకు గిల్ దూరమవుతే అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపైన చర్చ జరుగుతోంది.

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ వచ్చిందట. అతని రెండు టెస్టుకు ఆడించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. మొదట పడిక్కల్ ఆడతాడని చర్చ జరగకగా ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చిందట. దీంతో గౌహతికి బయలుదేరినట్లు సమాచారం. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆల్ రౌండర్ గా టీమిండియాకు బాగా పనిచేస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ తో పాటు అటాకింగ్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. మన ఇండియాకు సంబంధించిన గ్రౌండ్ కాబట్టి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల అంచ‌నా

Advertisement

దక్షిణాఫ్రికాతో 2వ టెస్టుకు భారత్ ఆడే అవకాశం ఉన్న ఎలెవన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ / నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్‌), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, కగిసో రబడ.

 

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×