E-Paper
Advertisement

WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

WTC : కోల్ క‌తా వేదిక‌గా టీమిండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 30 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. సౌతాఫ్రికా గెల‌వ‌డంలో కెప్టెన్ బ‌వుమా కీల‌క పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో బ‌వుమా 55 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భార‌త్ కి క‌ష్ట‌మైన టార్గెట్ ను నిర్దేశించారు. ఇరు జ‌ట్ల‌లో ఇత‌రులెవ్వ‌రూ 40 ర‌న్స్ పైగా స్కోర్ చేయ‌లేక‌పోయారంటేనే ఆయ‌న ఇన్నింగ్స్ విలువ ఏంటో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా మ‌ర‌గుజ్జు అని ట్రోల్స్ చేసినా .. బ‌వుమా మాత్రం త‌న బ్యాట్ తో స‌మాదానం చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న కెప్టెన్ గా ఒక్క టెస్ట్ కూడా ఓడిపోక‌పోవ‌డం విశేషం.

Also Read : Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!

గిల్ లేక‌పోవ‌డం టీమిండియాకి న‌ష్టం..!

ముఖ్యంగా తొలి టెస్ట్ లో టీమిండియా 30 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. 124 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 35 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 95 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. సౌతాఫ్రికా స్పిన్న‌ర్ హార్మ‌ర్ నాలుగు వికెట్ల‌తో టీమిండియా ప‌తానాన్ని శాసించాడు. అత‌ని తో పాటు కేశ‌వ్ మ‌హారాజ్, జాన్స‌న్, త‌లా రెండు వికెట్లు తీసుకున్నారు. టీమిండియా బ్యాట‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ (31), టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గాయ‌ప‌డి రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగిన కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ కి రాలేదు. శుబ్ మ‌న్ గిల్ లేక‌పోవ‌డంతో టీమిండియా తీవ్ర న‌ష్టం క‌లిగిందనే చెప్పాలి.

సౌతాఫ్రికా విన్.. పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పులు..

భార‌త్-సౌతాఫ్రికా మ‌ధ్య తొలి టెస్ట్ ఫ‌లితంతో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓట‌మితో టీమిండియా డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి ప‌డిపోయింది. భార‌త్ పాయింట్ల శాతం 54.17 గా ఉంది. ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ 8 మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ ల్లో విజ‌యం సాధించి మూడు మ్యాచ్ ల్లో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు సౌతాఫ్రికా ఈ విజ‌యంతో 66.7 శాతం తో రెండో స్థానానికి ఎగ‌బాకింది. పీసీటీ ప‌రంగా సౌతాఫ్రికా, శ్రీలంక జ‌ట్లు స‌మంగా ఉన్నాయి. పాయింట్ల ప‌రంగా మాత్రం శ్రీలంక 16 కంటే సౌతాఫ్రికా 24 పాయింట్ల‌తో ముందంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం శ్రీలంక మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు 100 పాయింట్లో అగ్ర‌స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజ‌యం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్ ల్లో 2 విజ‌యాలు, ఒక్క ఓట‌మిని చ‌విచూసింది. మొత్తానికి సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అత‌ను కీల‌క స‌మ‌యంలో కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌డం గొప్ప విష‌యం. తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం టీమిండియా బౌల‌ర్ బుమ్రా.. సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమాకి క్ష‌మాప‌ణ కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం.

Also Read : Ind vs sa : ఈ దద్దమ్మ గంభీర్ వల్ల 7 సిరీస్ లు ఓడిన టీమిండియా..

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×