E-Paper
Advertisement

IND VS PAK: నేడే పాక్‌, ఇండియా మ్యాచ్‌..90 శాతం వ‌ర్షం అడ్డంకి, రిజ‌ర్వ్ డే ఉంటుందా ? సిక్సుల వీరుడు వ‌చ్చేశాడు

IND VS PAK:  నేడే పాక్‌, ఇండియా మ్యాచ్‌..90 శాతం వ‌ర్షం అడ్డంకి, రిజ‌ర్వ్ డే ఉంటుందా ? సిక్సుల వీరుడు వ‌చ్చేశాడు
Advertisement

IND VS PAK:  టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇవాళ సాయంత్రం బిగ్ ఫైట్ జరగనుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మధ్య దాయాదుల పోరు జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటలకు ఈ భయంకరమైన ఫైట్ జరగనుంది. మొన్నటి వరకు అసలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగేది నమ్మకంగా ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఐసీసీ రంగంలోకి దిగడంతో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది పాకిస్తాన్. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. వర్షం పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బౌలింగ్ తీసుకుంటేనే బెటర్ అంటున్నారు. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా లైవ్ వస్తుంది.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

దాయాదుల పోరుకు వర్షం అడ్డంకి.. రిజర్వుడే ఉంటుందా?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికొన్ని గంటల్లో దాయాదుల పోరు ప్రారంభం కానుంది. అయితే ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మ్యాచ్ కు 90% వర్షం విలన్ గా మారనున్నట్లు చెబుతున్నారు. ప్రేమ దాస స్టేడియం సమీపంలో మ్యాచ్ ప్రారంభం సమయంలో 90% వర్షం పడుతుందని అంటున్నారు. మరికొందరైతే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రిజర్వుడే పెట్టేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ మ్యాచ్ షూరు అవుతుంది. ఈ మ్యాచ్ రద్దు అయితే 300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రిజర్వుడే పెట్టేందుకే సిద్ధమయ్యారట. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిషేక్ శర్మ రంగంలోకి దిగబోతున్నాడు. దీంతో సంజు శాంసన్ పైన వేటుపడనుంది.

ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ జ‌ట్ల అంచ‌నా

India Probable XI: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

Advertisement

Pakistan Probable XI: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (సి), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (WK), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్ మరియు, అబ్రార్ అహ్మద్

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×