E-Paper
Advertisement

Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Sunil Gavaskar: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026)  చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంటులో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి విజయం సాధించింది ఇండియా. అటు పాకిస్తాన్ కూడా రెండు మ్యాచ్ లలో విక్టరీ కొట్టింది. అయితే ఇప్పుడు ఈ రెండు బలమైన జట్లు తలపడబోతున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం శివరాత్రి రోజున బిగ్ ఫైట్ జరగనుంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ప్రేమ దాస స్టేడియంలో ( R.Premadasa Stadium, Colombo) ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Also Read: T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

అర్షదీప్ ను తొలగించండి.. వాషింగ్టన్ సుందర్ ను తీసుకోండి

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా పెను మార్పులు చేయాలని కోరారు సునీల్ గ‌వాస్కర్. టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను ( Arshadeep singh) పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో తొలగించాలని సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్షదీప్ సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ( Washington Sunder) జట్టులోకి తీసుకుంటే బెటర్ అని వెల్లడించారు.

ప్రేమ దాస స్టేడియం స్పిన్ బౌలింగ్ కు బాగా అనుకూలం. ఇలాంటి నేపథ్యంలో అరిశదీప్ సింధును పక్కకు పెట్టి వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవాలని కోరారు. అలా చేస్తే వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేస్తాడు. అందుకే అర్షదీప్ సింగ్ ను పక్కకు పెట్టాలని సునీల్ గవాస్కర్ సూచనలు చేశారు. అలాగే అభిషేక్ శర్మ అందుబాటులోకి వస్తే సంజు శాంసన్ ను పక్కకు పెట్టాలని తేల్చి చెప్పారు. లేకపోతే అతన్ని ఆడించాల్సిందేనని వెల్లడించారు. ఇది ఇలా ఉండ‌గా ఇండియా, పాక్ మ్యాచ్ జియో హాట్ స్టార్ వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది.

టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ జట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ XI: ఇషాన్ కిషన్ (WK), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష‌దీప్ సింగ్ లేదా వాష్టింగ‌న్ సుంద‌ర్, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ ప్రాబబుల్ XI: సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (c), ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా/సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్.

Also Read: Gerhard Erasmus Bowling Action: న‌మీబియాలో మ‌రో ఉస్మాన్ తారిక్‌..ఇండియాతో జ‌రిగిన‌ మ్యాచ్ లో ఎరాస్మ‌స్ త్రో బౌలింగ్

 

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×