IND VS SA 4th T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో టీమిండియా రెండు గెలవగా, మరో మ్యాచ్ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక ఇవాళ లక్నో వేదికగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగనుంది. లక్నోలోకి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకన క్రికెట్ స్టేడియంలో పొగమంచు ప్రభావం ఉంది. ఈ తరుణంలోనే టాస్ కాస్త ఆలస్యంగా వేయనున్నారు. ఇవాళ సాయంత్రం 6.50 గంటలకు పిచ్ పరిస్థితులు చూసిన తర్వాత టాస్ వేయనున్నారు. అప్పుడు కూడా పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటే, మ్యాచ్ రద్దు ప్రమాదం ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్లేయర్ల హెల్త్ పై పొగమంచు ప్రభావం ఉంటుందని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయట.
Also Read: IPL Auction 2026: మినీ వేలం తర్వాత 10 జట్ల ప్లేయర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయర్లు వీళ్లే
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లక్నో వేదికగా ఇవాళ నాలుగో టి20 జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ 6:30 గంటలకే ఉండాల్సింది. కానీ లక్నో స్టేడియంలో పొగ మంచు ప్రభావం బాగా ఉంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకన క్రికెట్ స్టేడియంలో ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow ) ప్లేయర్లు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అంతలా పొగ మంచు ప్రభావం స్టేడియంలో ఉంది. హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లు మాస్కులు పెట్టుకుని గ్రౌండ్ లోకి దిగారు. అయితే ఇలాంటి పరిస్థితులలో టాస్ వేసి మ్యాచ్ నిర్వహించడం చాలా కష్టం అవుతుందని అంపైర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే 6:50 నిమిషాల వరకు చూసి అప్పుడు పిచ్ పరిస్థితి అంచనా వేయనున్నారు. అప్పుడు కూడా పొగ మంచు ప్రభావం ఉంటే మ్యాచ్ రద్దు ప్రమాదం ఉంటుంది.
ఇండియా ప్రాబబుల్ XI: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా/ వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్
Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే
#INDvsSA | Toss has been delayed for the 4th T20I in Lucknow due to dense fog at the ground
Inspection is at 6:50PM IST
Follow live: https://t.co/A3DC3dAYYp pic.twitter.com/rpWAN2VXg6
— Firstpost Sports (@FirstpostSports) December 17, 2025