Yashasvi Jaiswal: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మంగళవారం రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పూణేలో జరుగుతున్న సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా యశస్వి జైస్వాల్ {Yashasvi Jaiswal} కి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ముంబై జట్టు తరపున ఆడిన యశస్వి జైష్వాల్ కి మ్యాచ్ పూర్తయ్యాక పరిస్థితి మరింత విషమించడంతో ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో వైద్యుల నిర్ధారణ ప్రకారం జైస్వాల్ కి తీవ్ర గ్యాస్ట్రో ఎంటరైటీస్ ఉన్నట్లు తేలింది. ఆసుపత్రిలో అతడికి అల్ట్రా సౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించి.. తగిన వైద్య చికిత్స అందించారు.
Also Read: Shree Charani-Lokesh: మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ సాయం… చెక్ ను అందజేసిన మంత్రి నారా లోకేష్
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ {Yashasvi Jaiswal} మెడిసిన్ కొనసాగిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో యశస్వి జైష్వాల్ ఆసుపత్రిలో చేరిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. మరోవైపు జైస్వాల్ అభిమానులు కూడా అతడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో యశస్వి జైష్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ మొత్తం అతడు కడుపునొప్పితో బాధపడినప్పటికీ.. నొప్పితోనే ఆటను కొనసాగించాడు. కానీ మ్యాచ్ అనంతరం పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ముంబై మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. అజింక్య రహనే 41 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. మరోవైపు సర్పరాజ్ ఖాన్ కూడా తన దూకుడైన బ్యాటింగ్ తో మ్యాచ్ ని పూర్తిగా మలుపు తిప్పాడు. కేవలం 22 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. 7 సిక్సర్లు, 6 ఫోర్లతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: Sarfaraz Khan: CSKలోకి ఎంట్రీ.. హీరో నాని సీన్ రిపీట్.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్
41 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం తర్వాత యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రహానే – సర్పరాజ్ ఖాన్ జోడి రెండవ వికెట్ కి కేవలం 39 బంతుల్లోనే 111 పరుగులు జోడించి లక్ష్యాన్ని సులభం చేశారు. ఇక సర్పరాజ్ ఖాన్ అవుట్ అయిన తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో నెంబర్ 8 గా వచ్చిన అధర్వ అంకోలేకర్ 9 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో మ్యాచ్ ని ముంబై వైపు తిప్పాడు. ఇక చివర్లో రహనే.. షమ్స్ మూలానీతో కలిసి 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించి డిపెండింగ్ ఛాంపియన్లకు అద్భుత విజయాన్ని అందించాడు.