E-Paper
Advertisement

IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే
Advertisement

IND vs PAK cricketers car collection: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రానించి ఈ విజయం సాధించింది. పాకిస్తాన్ పై ఏకంగా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా నేరుగా సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది. దీంతో టీమిండియా పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టును మాత్రం విమర్శలు చేస్తున్నారు మాజీలు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్ల కార్ల వివరాలు వైరల్ గా మారాయి. ఈ రెండు జట్ల క్రికెటర్లు ఎవరు ఎంత రేంజ్ లో కార్లను కొనుగోలు చేశారు.. ఎలాంటి కార్లు వాడుతున్నారనే విషయాలను వైరల్ చేస్తున్నారు.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ద‌గ్గ‌ర బెంట్లీ కాంటినెంట‌ల్ జీటీ, ఫ్ల‌యింగ్ స్ప‌ర్‌, ఫోర్చ్సే 911 ట‌ర్బో ఎస్‌, రేంజ్ రోవ‌ర్ వోగ్, లంబోర్గిని హురాకాన్‌, ఆడి R8 V10 ప్లస్, ఆడి RS 5, ఆడి S5, ఆడి Q7, ఆడి Q8, ఆడి A8 L, టయోటా ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. అటు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర అరుదైన కార్లు ఉన్నాయి. ఇందులో లంబోర్గిని ఉరుస్, ఇట్ టెల్స మోడల్ Y, రేంజ్ రోవర్, మెర్సిడేస్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు. మార్కెట్లోకి ఏ కారు వచ్చినా కొనుగోలు చేసే రోహిత్ శర్మ.. ఎంత రేటు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇక హ‌ర్ధిక్ పాండ్యా రోల్స్ రాయిస్ ఫాంట‌మ్, లంబోర్గిని హురాకాన్ ఈవీఓ, లంబోర్గిని ఉరుస్‌, మెర్సిడెస్ AMG G63, రేంజ్ రోవర్ వోగ్/SV, లెక్సస్ LM, ఆడి A6, జీప్ కంపాస్ లాంటి కార్లు క‌లిగి ఉన్నారు. లంబోర్గిని హురాకాన్ EVO, మెర్సిడెస్-AMG G63, ఆడి S5 లాంటి నాలుగు కార్ల‌ను శ్రేయాస్ అయ్య‌ర్ కొనుగోలు చేశారు.

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల ద‌గ్గ‌ర చీప్ కార్లు

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజం ద‌గ్గ‌ర ఆడి ఎస్‌5, ఆడి ఇ-ట్రాన్ జిటీ కార్లు ఉన్నాయి. షాహిన్ అఫ్రీది ద‌గ్గ‌ర ఆడి ఏ8 హైబ్రిడ్‌, టాయోటా ల్యాండ్ క్రూయిజ‌ర్‌, ఆడి ఏ4, హోండా సివిక్‌, ట‌యోటా రెవో, ట‌యోటా ఫార్చ్యూన‌ర్ ఉన్నాయి. హ‌స‌న్ అలీ ద‌గ్గ‌ర కియా స్పోర్టేజ్ ఒకే ఒక్క కారు మాత్రమే ఉంది. ఆసిఫ్ అలీ, షాబాద్ ఖాన్ ద‌గ్గ‌ర హోండా సివిక్ కార్లు మాత్ర‌మే ఉన్నాయి. అంటే ఇండియన్ క్రికెట‌ర్ల ఒక్క కారు విలువ కూడా పాకిస్తాన్ క్రికెట‌ర్ల ఆస్తుల కంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Advertisement

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

 

 

 

 

 

Related News

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

Big Stories

Advertisement
×