Inzamam-ul-Haq: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 ) నేపథ్యంలో బాల్ టాంపరింగ్ ( BALL-TAMPERING ) వ్యవహారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఫఖర్ జమాన్ ( Fakhar Zaman) బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. దీంతో వివాదం రాజుకుంది. అయితే ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారం పైన తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) స్పందించారు. అసలు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో బాల్ టాంపరింగ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ జరిగిందని నిరూపిస్తే బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని శపథం చేశారు ఇంజమామ్-ఉల్-హక్. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెరపైకి ఫిక్సింగ్ ఆరోపణలు, KKRపై ముంబై విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఊహించని పరిణామం ఎదురైంది. లాహోర్ వర్సెస్ కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రోజున మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా బాల్ టాంపరింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సంఘటనలో లహూర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ అలాగే ఫఖర్ జమాన్ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఈ సంఘటనపై తాజాగా మాజీ కెప్టెన్ ఇంజమామ్ స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు సందర్భంగా ఎలాంటి బాల్ టాంపరింగ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఇవ్వండి పడ్డారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పైన ఇండియన్ మీడియా విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎదగకుండా ఈ కుట్రలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. లాహోర్ వర్సెస్ కరాచీ మ్యాచ్ లో బంతిని తీసుకొని సంతకం చేసే ప్రయత్నం మాత్రమే జమాన్ చేశాడని వెల్లడించారు. ఆ సమయంలో షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హరిస్ రవూఫ్ ముగ్గురు ఒకే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. చివరి ఓవర్ ఎలా వేయాలి అనే దాని పైన డిస్కస్ చేసుకున్న తర్వాత.. బంతిపై ఫఖర్ జమాన్ సంతకం చేసే ప్రయత్నం చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ అక్కడ బాల్ టాంపరింగ్ జరిగినట్లు రుజువులు లేవని కుండబద్దలు కొట్టి చెప్పారు ఇంజమామ్. కానీ పాకిస్తాన్ దేశాన్ని అంతర్జాతీయంగా బ్లేమ్ చేసేందుకు ఇండియా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.. ఇక ఈ బాల్ టాంపరింగ్ పేరుతో పాకిస్తాన్ క్రికెటర్లను విలన్లుగా చిత్రీకరించేందుకు కుట్రలు పండిందని ఫైర్ అయ్యారు. కాగా బాల్ టాంపరింగ్ జరిగిన నేపథ్యంలో షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హరిస్ రవూఫ్ ముగ్గురు పైన వేటు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
https://www.facebook.com/100087922547709/posts/966101269663949/?rdid=t3F7iQJIrzKnAXEQ#