E-Paper
Advertisement

MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

MI vs KKR Toss Fixing:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం రోజున బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగగా.. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ ( Mumbai Indians vs Kolkata Knight Riders) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. కానీ అద్భుతంగా పోరాడిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మొదటి మ్యాచ్ లోనే కేకేఆర్ భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై విజయం సాధించినప్పటికీ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబై వర్సెస్ కేకేఆర్ టాస్ సమయంలో ఫిక్సింగ్ ( MI vs KKR Toss Fixing) జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు వైరల్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ముంబై ఇండియన్స్ అంటేనే మ్యాచ్‌ ఫిక్సింగ్ ( Match Fixing) అని మండిపడుతున్నారు.

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

KKRపై ముంబై విజ‌యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రెండవ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కేకేఆర్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్, బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కేకేఆర్. ఈ సందర్భంగా 20 ఓవర్లలో 220 పరుగులు సాధించింది కేకేఆర్. అయితే ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి చేదించింది ముంబై ఇండియన్స్. దీంతో 14 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 14 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ టోర్నమెంటులో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. మరి ఇదే ఊపుతో టైటిల్ గెలుస్తుందా ? లేక తేలిపోతుందా ? అనేది చూడాలి.

వివాదంగా మారిన టాస్.. ఫిక్సింగ్ జరిగిందా ?

ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా టాస్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అజింక్య రహనే టాస్ కోసం రవి శాస్త్రి వద్దకు వచ్చారు. ఈ క్రమంలో హోం గ్రౌండ్ కాబట్టి హార్దిక్ పాండ్యా టాస్ వేశాడు. ఆ సమయంలో కెమెరామెన్ ఎవరు టాస్ గెలిచారనే ఫుటేజ్ చూపించకుండా, మరో ఫుటేజ్ చూపించాడు. అటు రహానే కూడా టాస్ తో తనకేం పనిలేదు అన్నట్లుగా వ్యవహరించాడు. ఇక చివరికి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడని రవి శాస్త్రీయనే ప్రకటించేశాడు. అది కూడా డౌట్ గానే చెప్పాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన హార్దిక్ పాండ్యా తాము బౌలింగ్ చేస్తామని తెలిపాడు. ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్… కేకేఆర్ ను ఓడించింది. దీంతో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. టాస్ ఫిక్సింగ్ జరగడంతోనే కేకేఆర్ ఓడిపోయిందని అభిమానులు అంటున్నారు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ జరిగితే కచ్చితంగా ఫిక్సింగ్ ఖాయమని అంటున్నారు.

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

?igsh=aXd1eWs1ajhuY3Qx

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×