E-Paper
Advertisement

Inzamam-ul-Haq: హర్భ‌జ‌న్ సింగ్ తో మాతో క‌లిసి న‌మాజ్ చేసేవారు !

Inzamam-ul-Haq: హర్భ‌జ‌న్ సింగ్ తో మాతో క‌లిసి న‌మాజ్ చేసేవారు !

Inzamam-ul-Haq:  ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. పహల్గాం సంఘటన జరిగిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. రెండు దేశాల మధ్య క్రికెట్, ఇతర మ్యాచ్ లు జరిగితే ప్లేయర్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ హర్భజన్ సింగ్ పై ( Harbhajan Singh) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో హర్భజన్ సింగ్ తమతో కలిసి నమాజ్ చేసేవాడని బాంబు పేల్చారు. ముస్లిం మత పెద్ద మౌలానా తారిక్ జ‌మీల్ ప్రవచనాలను హర్భజన్ సింగ్ వినేవాడు అంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు. దీంతో ఇంజమామ్ ఉల్ హ‌క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

హర్భ‌జ‌న్ సింగ్ తో మాతో క‌లిసి న‌మాజ్ చేసేవారు !

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సంబంధాలపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య సంబంధాలు బాగుండేదని వెల్లడించారు. పాకిస్తాన్ వచ్చినప్పుడు తమ హోటల్ లో మౌలానా తారిక్ జ‌మీల్ మతపరమైన ప్రవచనాలు చెప్పేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ లాంటి భారత ఆటగాళ్లు వచ్చి వాటిని వినే వారని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. వాళ్లతో పాటు హర్భజన్ సింగ్ కూడా మతపరమైన ప్రవచనాలు విని, ఆ తర్వాత తమతో నమాజ్ చేసేవాడని కూడా ఆరోపణలు చేశారు. మౌలానా తారిక్ జ‌మీల్ ప్ర‌వ‌చ‌నాలు వినాలని హర్భజన్ సింగ్ తనతో స్వయంగా చెప్పారని కూడా బాంబు పేల్చారు.

ఇంజ‌మామ్ తాగి వాగుతున్నాడంటూ హ‌ర్భ‌జ‌న్ కౌంట‌ర్

ఇక ఇంజమామ్ ఉల్ హ‌క్ ( Inzamam-ul-Haq) చేసిన ఈ వ్యాఖ్యలకు హార్భజన్ సింగ్ కూడా కౌంటర్ ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. తానేమీ నమాజ్ చేయలేదని… ఇంజ‌మామ్ బాగా తాగి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. తాను మొదటి నుంచి సిక్కు ధర్మాన్ని మాత్రమే పాటిస్తున్నానని.. తన జీవితంలో గురుగ్రంధ సాహిబ్ ప్రవచనాలు మాత్రమే స్వీకరించాన‌ని వెల్లడించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గతంలో మ్యాచ్ లు జరిగినప్పుడు గ్రౌండ్ లోనే ఘర్షణలు జరిగాయని అందరికీ తెలుసు అన్నారు. డ్రెస్సింగ్ రూమ్లలో వాళ్లతో అస్సలు క్లోజ్ గా ఉండే వాళ్ళం కాదని వివరించారు. ఇంజమామ్ ఉల్ హ‌క్ కావాలనే కట్టు కథలు అల్లుతున్నాడని ఫైర్ అయ్యారు హ‌ర్భ‌జ‌న్ సింగ్. ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

https://www.facebook.com/photo/?fbid=1428812769259719&set=a.358965252911148

Related News

5 సిక్సులు, 4 బౌండ‌రీలు..3 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన అర్జున్ టెండూల్క‌ర్

నైట్ క్ల‌బ్ లో గొడ‌వ‌..వీధి రౌడీల్లాగా త‌న్నుకున్న‌ బెన్ స్టోక్స్‌, అట్కిన్సన్

పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

టెస్టుల్లో ఉండే ఫాలో-ఆన్ అంటే ఏంటి ? ఈ కొత్త రూల్స్ గురించి తెలుసా ?

Tanveer Ahmed: షేక్ హ్యాండ్ కాదు, డ‌బ్బుల కోసం జై షా ఎదైనా చేస్తాడు

రిజ్వాన్ కు ఒళ్లంతా బ‌లుపే…బంగ్లా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదు

IND VS AFG: గిల్ కు ఘోర అవ‌మానం..కెప్టెన్ నేనే అంటూ రిష‌బ్ పంత్ బిల్డ‌ప్

Big Stories

×