Inzamam-ul-Haq On PCB: ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు అవమాన పాలు పాలవుతోంది. ఎక్కడ చూసినా పాకిస్తాన్ కు నెగిటివ్ వైబ్రేషన్స్ తప్ప… పాజిటివ్ ఏం లేదు. ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికి రెండు మ్యాచ్ లు ఓడిపోయిన పాకిస్తాన్… వైట్ వాష్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం (Imam ul haq Injury) గురించి ఆయన మేనమామ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యక్తులు చేశారు. తన అల్లుడిపై బ్యాన్ విధిస్తే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దల చిట్టా విప్పుతానని హెచ్చరించారు. అందరి భాగోతాలు తనకు తెలుసని… తాను బయట పెడితే మాత్రం ఉరేసుకుని చస్తారని హెచ్చరించారు. దీంతో ఇంజమామ్ వుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ తరుణంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా ముందుకు వెళుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. అయితే రెండో టెస్టులో పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ కాలికి గాయమైంది. దీంతో రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ చేయకుండానే వెనిదిరిగాడు. అయితే అతడి గాయం ఫేక్ అని.. కావాలనే నాటకాలు ఆడుతున్నాడని చర్చ మొదలైంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కమిటీని ఏర్పాటు చేసి దీనిపై విచారణ చేస్తోంది. ఇందులో ఇమామ్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలిస్తే రెండు సంవత్సరాల బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇమామ్ ఉల్ హక్ మేనమామ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించారు. ఒక ప్లేయర్ కు గాయం అయితే ఇలా అవమానిస్తారా? మీ ఇంట్లో వాళ్లకు అనారోగ్యంగా ఉంటే ఇలాగే హేళన చేస్తూ మాట్లాడతారా? అంటూ ఫైర్ అయ్యారు. గాయపడ్డ వాడికి ట్రీట్మెంట్ అందించాల్సిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… నిపుణుల కమిటీతో దర్యాప్తు చేయించడం అవసరమా ? అంటూ ఫైర్ అయ్యారు. ఒకవేళ తన అల్లుడు ఇమామ్ ఉల్ హక్ పైన రెండు సంవత్సరాల బ్యాన్ విధిస్తే మాత్రం తాను అందరి అంతు చూస్తానని హెచ్చరించారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉన్న పెద్దల చిట్టా మొత్తం బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. అందరి రహస్యాలు తన దగ్గర ఉన్నాయని.. వాటిని మీడియా ముందు పెడితే.. తలదించుకొని ఉరేసుకుంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత తానేమీ చేయలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఇమామ్ ఫుల్ హక్ కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కోరారు. ఇమామ్ గాయం నిజమైనదేనని తెలిపారు.