Mohammad Rizwan: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అత్యంత దారుణంగా రెండు టెస్టుల్లోను ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లతో పాటు కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి దా రుణంగా పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే.. మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతంగా రాణించేందుకు డ్రగ్స్ తీసుకునే ప్రయత్నం అతడు చేశాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. చర్యలకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మరో పెను సంచలనానికి దారి తీసింది.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ గడ్డపై మహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన అత్యంత చెత్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ గడ్డపై ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొత్తం రెండు మ్యాచ్ లు ఆడాడు మహమ్మద్ రిజ్వాన్. ఈ రెండు మ్యాచ్ లలో మొత్తం కలిసి 53 పరుగులు మాత్రమే సాధించాడు. నాలుగు సార్లు బ్యాటింగ్ చేస్తే ఒకసారి కూడా అర్థ సెంచరీ చేయలేదు ఈ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్. గతంలో కూడా ఇదే దరిద్రమైన బ్యాటింగ్ కొనసాగించాడు మహమ్మద్ రిజ్వాన్.
ఇప్పుడు కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై సరిగ్గా బ్యాటింగ్ చేయకపోతే తనను తొలగిస్తానని భావించి.. డ్రగ్స్ తీసుకునే ప్రయత్నం చేశాడట మహమ్మద్ రిజ్వాన్. ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో అతడిని పాకిస్తాన్ దేశానికి వెంటనే పీసీబీ పంపించినట్లు తెలుస్తోంది. సరైన ఫామ్ లేక మహమ్మద్ రిజ్వాను పాకిస్తాన్ కు పంపినట్లుగా పీసీబీ చెపుతున్నప్పటికీ… అసలు వాస్తవం అది కాదని అంటున్నారు. డ్రగ్స్ వ్యవహారం బయటపడుతుందని వెంటనే అతడిని అక్కడి నుంచి తప్పించారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
పాకిస్తాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్ లార్డ్స్ టెస్టులో నకిలీ గాయం పేరుతో డ్రామాలు ఆడాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గుర్తించింది. దీంతో అతనిపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.