E-Paper
Advertisement

Gill-Sudharsan Partnership Records: గిల్-సుదర్శన్..సెంచరీలు.. రికార్డుల మీద రికార్డులు

Gill-Sudharsan Partnership Records: గిల్-సుదర్శన్..సెంచరీలు.. రికార్డుల మీద రికార్డులు
Advertisement

IPL 2024 GT vs CSK Shubman Gill & Sai Sudharsan partnership Records: ఐపీఎల్ 2024 సీజన్ లో రికార్డులకేమీ తక్కువ లేదు. ఒకదానిని మించి ఒకటి వస్తూనే ఉన్నాయి. కాకపోతే అన్ని రికార్డులకన్నా ఇవికొన్ని స్పెషల్ గా ఉండటంతో నెట్టింట పెద్ద చర్చగా మారింది. చెన్నయ్ వర్సెస్ గుజరాత్ మధ్య అహ్మాదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఇవి చోటు చేసుకున్నాయి.

గుజరాత్ ఓపెనర్స్ సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ వెనక్కి తిరిగి చూడకుండా ఆడారు. అంతేకాదు మొదటి వికెట్‌కు ద్విశతక (210) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడీగా గిల్-సుదర్శన్ రికార్డులకెక్కారు.

Advertisement

అంతకుముందు ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లి (229), ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లి (215*), డికాక్-కేఎల్ రాహుల్ (210*) టాప్-3లో ఉన్నారు. ఇప్పుడు సాయి సుదర్శన్-గిల్ (210) మూడో స్థానంలో సమానంగా ఉన్నారు.

ఇవేకాదు ఇంకా పలు రికార్డులు బద్దలయ్యాయి. టీ20 ఫార్మాట్‌లో ఒకే వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లితో కలిసి గిల్ చరిత్రకెక్కాడు. ఇప్పుడు చేసిన సెంచరీతో అహ్మదాబాద్ గ్రౌండ్ లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడుగా నిలిచాడు. తనతో పాటు విరాట్ కొహ్లీ కూడా చిన్నస్వామి స్టేడియంలో నాలుగు సెంచరీలు చేశాడు.

Advertisement

Also Read: ముంబై మెరుస్తుందా? నేడు ఈడెన్ గార్డెన్స్ లో.. కోల్ కతాతో మ్యాచ్

ఇవికాకుండా టీ 20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇంతవరకు టీ 20 ఫార్మాట్ లో గిల్ ఆరు సెంచరీలు చేశాడు. రుతురాజ్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (9 సెంచరీలు), రోహిత్ శర్మ (8 సెంచరీలు) టాప్-2లో ఉన్నారు

శుభ్‌మన్ గిల్‌తో పోటాపోటీగా సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు. తను మొదట్లో నిలకడగానే ఆడాడు. తర్వాత గేర్ మార్చి సెంచరీ చేశాడు. ఇలా ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ పరంగా చూస్తే, వేగంగా 1000 పరుగులు సాధించిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉమ్మడిగా ఉంది.

సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించాడు. సచిన్, రుతురాజ్ 31 ఇన్నింగ్స్‌ల్లో, తిలక్ వర్మ 33 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను అందుకున్నారు.

ఓవరాల్‌గా చూస్తే ఐపీఎల్‌లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాథ్యూ హెడెన్‌తో కలిసి సుదర్శన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. షాన్ మార్ష్ (21), సైమన్స్ (23) టాప్-2లో ఉన్నారు.

మొత్తానికి ఒక మ్యాచ్ జరిగింది. అందులో ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేశారు. పలు రికార్డులను మోసుకొచ్చారు.

Tags

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×