BigTV English

Nearly 3 Crore Liquor Seized: ఎన్నికల వేళ మద్యం ప్రవాహం, పుష్ప ఫిల్మ్ మాదిరిగా, గోవా టు విజయవాడ

Nearly 3 Crore Liquor Seized: ఎన్నికల వేళ మద్యం ప్రవాహం, పుష్ప ఫిల్మ్ మాదిరిగా, గోవా టు విజయవాడ

Nearly 3 Crore Liquor Seized(Telangana news today): తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరింది. శనివారంతో ప్రచారం ముగియడంతో నేతలు తమ తమ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు విపరీతంగా డబ్బు పట్టు బడేది. మారిన పరిస్థితుల రీత్యా ట్రెండ్ సెట్ చేశారు నేతలు. డబ్బుకు బదులుగా బంగారం, లిక్కర్ వంతైంది.


తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో భారీగా మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. మార్కెట్లో దీని విలువ అక్షరాలా దాదాపు మూడు కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. జడ్చర్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వాహనాల్లో కెఏ 22సీ 2983 నెంబరు గల లారీని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. పుష్ప సినిమా స్టయిల్‌లో పాల వ్యాన్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేశారో.. పైన ఎరువులు నింపి వాటి కింద మద్యం బాటిళ్లను నింపేశారు.

తొలుత పోలీసులు ఎరువులు అనుకుని భావించారు. కాకపోతే లాఠీతో లారీని అన్ని వైపులా కొడితే సౌండ్ మారడంతో అనుమానం వచ్చింది. వెంటనే లారీలో సరుకును కూడా చెక్ చేయడంతో మద్యం వ్యవహారం వెలుగుచూసింది. గోవా నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు తెలుస్తోంది.


ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఏపీ ఎక్కువగా గోవా లిక్కర్ హంగామా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ అమర్చారు ఏపీ ఎన్నికల అధికారులు. దీంతో గోడౌన్ల నుంచి లిక్కర్ ఎక్కడకు వెళ్తుందనేది క్లియర్‌గా అధికారులకు సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు గోవా లిక్కర్‌‌పై ఫోకస్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

ALSO READ: జగన్‌కు సీఎం రేవంత్ కౌంటర్, ముందు ఫ్యామిలీ సంగతులు చూడండి..

వారం కిందట నంద్యాల వద్ద కూడా భారీ ఎత్తున గోవా మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండురోజులు ఉండడంతో పోలీసులు తెలంగాణలోనే కాదు, ఏపీలో అడుగడుగునా పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్, భారీ ఎత్తున మొహరించారు.

 

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×