MI vs KKR IPL 2024 Today Match Dream11 Prediction: ఐపీఎల్ 2024 ఇలా ముగుస్తుందని ముంబై ఇండియన్స్ ఊహించనే లేదు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసి ముంబై ఫ్రాంచైజీ తన గొయ్యి తనే తవ్వుకుందా? అంటే అవుననే చెప్పాలి. కానీ ఆ విషయాన్ని వాళ్లు ఒప్పుకోరు.. పైకి చెప్పరు.. ముంగిలా మాట్లాడరు.. అలా సోద్యం చూసినట్టు చూస్తున్నారు. నీతూ అంబానీ, కొడుకు వచ్చేవారు. వాళ్లూ రావడం మానేశారు.
సరే మొత్తానికి ప్లే ఆఫ్ నుంచి మొదటే బయటకి వెళ్లిపోయిన ముంబై నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. రాత్రి 7.30కి ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
కోల్ కతా నైట్ రైడర్స్ ఇంతవరకు 11 మ్యాచ్ లు ఆడి 8 గెలిచింది. 16 పాయింట్లతో టాప్ లో ఉంది. అదే ముంబై 12 మ్యాచ్ లు ఆడి 4 గెలిచింది. 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇకపోతే ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 33 మ్యాచ్ లు జరిగాయి. కోల్ కతా 10 గెలిస్తే, ముంబై 23 విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఆటగాళ్లందరూ అరవీర భయంకరంగా కనిపిస్తారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా అందరూ పులుల్లాగే ఉన్నారు. కానీ చేతులెత్తేస్తున్నారు. మరోవైపు బౌలింగులో బుమ్రా ఒక్కడే నిలకడగా బౌలింగు చేస్తున్నాడు.
Also Read: ఇద్దరు సెంచరీలతో గుజరాత్ జయభేరి.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి
ఇంక కోల్ కతా విషయానికి వస్తే, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కూల్ గా విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లింది. ఇప్పుడీ మ్యాచ్ గెలిచిందంటే గుండెల మీద చెయ్యివేసుకుని 18 పాయింట్లతో ప్లే ఆఫ్ కి వెళ్లిపోతుంది. లేదంటే మిగిలిన మ్యాచ్ లు జరిగే వరకు వెయిట్ చేయాలి. అదే ముంబైకి గెలిచినా, ఓడినా ఒక్కటే, గెలిస్తే పరువు నిలబడుతుంది. లేదంటే ఇంక చెప్పుకోడానికి ఏమీ ఉండదు.
ఇలా టాప్ లో ఉన్న జట్టు, అట్టడుగున ఉన్న జట్ల మధ్య పోటీ, ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.