E-Paper
Advertisement

IPL 2024 LSG Vs GT Highlights: ఐదు వికెట్లతో చెలరేగిన యశ్ ఠాకూర్.. గుజరాత్ చిత్తు!

IPL 2024 LSG Vs GT Highlights: ఐదు వికెట్లతో చెలరేగిన యశ్ ఠాకూర్.. గుజరాత్ చిత్తు!
Advertisement
Lucknow Super Giants vs Gujarat Titans Live Updates
Lucknow Super Giants vs Gujarat Titans Live Updates

Lucknow Super Giants Vs Gujarat Titans Match Highlights: లక్నో ఏకానా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 33 పరుగులతో ఘనవిజయం సాధించింది. యశ్ ఠాకూర్ 5 వికెట్లతో చెలరేగడంతో లక్నో 130 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అంతకుముందు మార్కస్ స్టోయినిస్(58), కేఎల్ రాహుల్(33), నికోలస్ పూరన్(32*) రాణిచడంతో లక్నో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

Advertisement

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. పవర్ ప్లేలో ఈ జోడి 54 పరుగులు జోడించింది. ఈ తరుణంలో 19 పరుగులు చేసిన గిల్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత కేన్ విలియమ్‌సన్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత ఓవర్లో కీపర్ బీఆర్ శరత్(2) అవుట్ అయ్యాడు. గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా 54-0 నుంచి 61-4 పడిపోయింది.

Also Read:Who is Yash Thakur: యశ్ ఠాకూర్ ఎవరు భయ్?

Advertisement

ఆ వెంటనే 12 పరుగులు చేసిన దర్శన్ నల్కండే వికెట్ కోల్పోయింది గుజరాత్. దీంతో 80 పరుగుల వద్ద టైటాన్స్ 5వ వికెట్ కోల్పోయింది. తరువాత 17 పరుగులు చేసిన విజయ్ శంకర్ ఆరో వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. 2 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద గుజరాత్ 8వ వికెట్ కోల్పోయింది. 19వ ఓవర్లో 30 పరుగులు చేసిన రాహుల్ తెవాతియా యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత నూర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో లక్నో 33 పరుగులతో విజయం సాధించింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సిక్స్ కొట్టి ఊపుమీదున్న డి కాక్‌ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తరువాత 7 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ 3వ వికెట్‌కు 73 పరుగులు జోడించారు.

Also Read: Jasprit Bumrah Creates History: 150 వికెట్ల క్లబ్ లో.. యార్కర్ స్టార్ జస్ప్రీత్ బూమ్రా

ఈ తరుణంలో 33 పరుగులు చేసిన రాహుల్ దర్శన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత పూరన్‌తో జతకట్టిన స్టోయినిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 58 పరుగులు చేసిన స్టోయినిస్ పెవిలియన్ చేరాడు. 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లక్నోను పూరన్, బదోని ఆదుకునే ప్రయత్నం చేశారు. 20 పరుగులు చేసిన బదోని రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివర్లో పూరన్ దూకుడుగా ఆడటంతో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 చేసింది.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×