BigTV English

Chaithra Navarathri 2024: ఈ రోజు నుంచే చైత్ర నవరాత్రులు.. అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా?

Chaithra Navarathri 2024: ఈ రోజు నుంచే చైత్ర నవరాత్రులు.. అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా?
Chaithra Navarathri 2024
Chaithra Navarathri 2024

Chaithra Navarathri 2024: ఈ ఏడాది ఈ రోజు నుంచే దేశ వ్యాప్తంగా చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ హిందూ పండుగ నాలుగుసార్లు చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. తొమ్మిది రోజులపాటు అమ్మవారి తొమ్మిది అవతారాలను భక్తి, శ్రద్ధలతో భక్తులు పూజిస్తుంటారు. అమ్మవారి తొమ్మిది రూపాలలో మా శైలపుత్రి, మా బ్రహ్మచారిణి, మా చంద్రఘంట, మా కూష్మాండ, స్కంద మాత, మా కాత్యాయని, మా కాళరాత్రి, మా మహాగౌరి, మా సిద్ధిదాత్రిలను పూజిస్తారు.


దృక్ పంచాంగ్ ప్రకారం ఏప్రిల్ 9వ తేదీన అంటే ఈ ఏడాది ఉగాది పర్వదినాన చైత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 17వ తేదీన ముగియనున్నాయి.

నవరాత్రులు..


ఏప్రిల్ 9 – ఘటస్థాపన పూజ, మా శైలపుత్రి

ఏప్రిల్ 10 – మా బ్రహ్మచారిణి

ఏప్రిల్ 11 – మా చంద్రఘంట

ఏప్రిల్ 12 – మా కూష్మాండ

ఏప్రిల్ 13 – స్కంద మాత

Also Read: Ugadi Special: క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, బ్రహ్మ సృష్టించిన..

ఏప్రిల్ 14 – మా కాత్యాయని

ఏప్రిల్ 15 – మహా సప్తమి, మా కాళరాత్రి

ఏప్రిల్ 16 – మహా అష్టమి, మా మహాగౌరీ పూజ

ఏప్రిల్ 17 – రామ నవమి, మా సిద్ధిదాత్రి

పూజా విధానం..

ఛైత్ర నవరాత్రులకు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. ఈ తరుణంలో ఉపవాసం ఉండాలి. అమ్మవారి స్తోత్రాలు పఠిస్తూ పూజలు చేయాలి. కుమారీ పూజ, సువాసినీ పూజ వంటివి ఇందులో అమ్మవారికి ప్రత్యేకమైనవి. అమ్మవారి పూజలో ఫోటో, కుంకుమ, కర్పూరం, మామిడాకులు, పసులు, పూలమాల, ఆవాలు, కొబ్బరి, జాజికాయ, తేనె, చక్కెర, లవంగాలు, పాలు, పెరుగు, పసుపు, తెలుపు వస్త్రాలు వంటివి ఉపయోగిస్తారు. అమ్మవారి ఫోటోను అలంకరించి ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు, ఎర్రని బియ్యంతో అలంకరిస్తారు. ఇందులో ఎర్రని గంధంను కూడా వాడుతారు. తొమ్మిది రోజుల పాటు దీపారాధన చేసి అమ్మవారిని నిష్టగా పూజిస్తారు.

Also Read: Ugadi Horoscope in Telugu: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..?

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×