Jasprit Bumrah Creates History in IPL 2024: పదునైన యార్కర్లతో ప్రపంచంలోని టాప్ బ్యాటర్లని భయపెట్టే జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ లో 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. అత్యంత ఖరీదైన లీగ్ క్రికెట్ గా పేరెన్నికగన్న ఐపీఎల్ లో ఘతన సాధించిన పదకొండో బౌలర్ గా చరిత్ర కెక్కాడు. బుమ్రా ఇండియన్ క్రికెట్ లోకి వచ్చిన తర్వాత అనతికాలంలోనే ప్రధాన బౌలర్ గా ఎదిగాడు. ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఎన్నో సందర్భాల్లో గేమ్ ఛేంజర్ గా మారాడు. తర్వాత టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు.
ఐపీఎల్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ ట్రోఫీలు సాధించడంలో తను కీలక పాత్ర పోషించాడు. 2013లో ఐపీఎల్ లోకి వచ్చిన బుమ్రా 2019లో 16 వికెట్లు, 2020లో 15 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2021, 2022లో 14 వికెట్లు చొప్పున తీశాడు.
ప్రస్తుతం 150 వికెట్లు తీసి అత్యంత వేగంగా తీసిన మూడో క్రికెటర్ గా నిలిచాడు. తను 124 మ్యాచ్ ల్లో ఈ ఫీట్ సాధిస్తే మలింగ 105, యజ్వేంద్ర చహల్ 118 మ్యాచ్ లో 150 వికెట్లు పడగొట్టారు.
Also Read: ఐదు వికెట్లతో చెలరేగిన యశ్ ఠాకూర్.. గుజరాత్ చిత్తు..
ఇకపోతే బుమ్రాకన్నా ముందు 150 వికెట్ల క్లబ్ లో ఉన్న ఐపీఎల్ ప్లేయర్లు ఎవరంటే …యజ్వేంద్ర చహల్ 195 వికెట్లతో అందరికన్నా ముందున్నాడు. ఇక బ్రావో (181), అమిత్ మిశ్రా (173), అశ్విన్ (172), భువనేశ్వర్ కుమార్ (171), లసిత్ మలింగ (170), సునీల్ సరైన్ (166), రవీంద్ర జడేజా (153) తర్వాత స్థానాల్లో ఉన్నారు.
150 వికెట్ల క్లబ్ లో చేరడం మాత్రమే కాదు…హ్యాట్రిక్ ఓటములతో తల్లడిల్లుతున్న ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సరైన సమయంలో 2 వికెట్లు తీసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు.