E-Paper
Advertisement

IPL 2026: వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే, డ‌బ్బులు తిరిగి ఇస్తారా లేక నొక్కెస్తారా ?

IPL 2026: వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే, డ‌బ్బులు తిరిగి ఇస్తారా లేక నొక్కెస్తారా ?
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 13 మ్యాచులు జరిగాయి. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 14 వ మ్యాచ్ కూడా జరుగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో చాలా మ్యాచులకు వర్షం విలన్ గా మారుతుంది. ఇప్పటికే కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రద్దు కాగా… నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కు వర్షం విలన్ గా మారింది. ఈ క్రమంలో స్టేడియానికి వచ్చిన అభిమానులు, వేలకు వేలు టికెట్లు కొని నిరాశకు గురయ్యారు.

Also Read: Farhan – Smith: సింగిల్ తీయ‌కుండా స్మిత్ ను అవ‌మానించిన ఫ‌ర్హాన్..బాబ‌ర్ ప‌గ‌ను తీర్చుకున్నాడుగా

మ్యాచ్ రద్దు అయితే టికెట్ల డబ్బులు రిటర్న్ చేస్తారా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 18 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 19వ సీజన్ కొనసాగుతోంది. అయితే ఇలాంటి క్రమంలో చాలాసార్లు వర్షం కారణంగా మ్యాచులు రద్దు అయ్యాయి. ఆ సమయంలో స్టేడియాలకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. వేలకు వేలు డబ్బులు పెట్టి, టికెట్లు కొని స్టేడియాలకు వస్తే వరుణుడు వాళ్లకు శాపంగా మారాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే టికెట్ల డబ్బులు రిటర్న్ కచ్చితంగా ఇస్తారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. పేటీఎం, బుక్ మై షో ( Book my show) లాంటి ఆన్లైన్ ఫ్లాట్ ఫారాల ద్వారా మ్యాచ్ టికెట్లు కొంటారు. అయితే మ్యాచ్ రద్దు అయితే ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో డబ్బులు అదే యాప్ ద్వారా రిటర్న్ అవుతాయి. కాబట్టి ఐపిఎల్ అభిమానులు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఒకవేళ స్టేడియాల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తే.. ఆ ఫిజికల్ టికెట్ చూపించి మళ్లీ అక్కడే డబ్బులు రిటర్న్ తీసుకోవాలి. కానీ దీనికి ప్రత్యేకమైన సమయం సందర్భం ఉంటుంది. వాళ్లు విధించిన గడువులోపు వెళ్లి టికెట్లు ( IPL 2026 tickets) వాపస్ చేసి డబ్బులు తీసుకోవాలి.

వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్ డే పెడితే ప‌రిస్థితి ఏంటి ?

వర్షం ( RAin ) కారణంగా మ్యాచ్ రద్దు అవుతుంది. ఇలా వర్షం పడితే కొన్ని సమయాలలో రిజర్వుడే పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటప్పుడు మళ్లీ కొత్త టిక్కెట్లు కొనాల్సిన పనిలేదు. మరుసటి రోజు పాత టికెట్లను చూపించి మ్యాచ్ చూడవచ్చు. అలాంటప్పుడు డబ్బులు వెనక్కి రావు. ఇక మొన్న కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( KKR vs PBKS) మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ రద్దయింది. ఆ సమయంలో కూడా అభిమానులకు టికెట్ల డబ్బులు రిటర్న్ చేశారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు వెనుక కుట్ర‌లు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×