Farhan – Smith: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) పోటీగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ( Pakistan Super League Tournament) రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. నసీమ్ షా వివాదాస్పద పోస్టు నుంచి మొదలుకొని, బాల్ టాంపరింగ్ వరకు ఏదో ఒక అంశం వివాదంగా మారుతోంది. అయితే లేటెస్ట్ గా ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ( Multan Sultans) సంబంధించిన సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పరువు తీశాడు. సింగిల్ తీయకుండా, స్ట్రైక్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. గతంలో బాబర్ ఆజంను (Babar Azam ) అచ్చం ఇలాగే స్టీవెన్ స్మిత్ ( Steve Smith) అవమానించగా, ఇప్పుడు అతన్ని ఫర్హాన్ ఇన్సల్ట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన పాకిస్తాన్ అభిమానులు, బాబర్ ఆజం ప్రతీకారాన్ని ఫర్హన్ తీసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న సోమవారం ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ రావల్పిండిజ్ ( Multan Sultans vs Rawalpindiz ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. లాహూర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ముల్తాన్ సుల్తాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫర్హాన్, స్టీవెన్ స్మిత్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభంలోనే ఓవర్ మొత్తం ఆడేసిన స్మిత్, చివరి బంతికి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు.
అయితే మరోవైపు ఉన్న ఫర్హాన్ మాత్రం, నెక్స్ట్ ఓవర్ బ్యాటింగ్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆ సింగిల్ ను రిజెక్ట్ చేశాడు. దీంతో స్టీవెన్ స్మిత్ కు అవమానం జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు బాబర్ ఆజాంను గతంలో స్మిత్ అవమానించాడని… ఇప్పుడు దానికి ప్రతికారంగా ఫర్హాన్ కూడా రివేంజ్ తీర్చుకున్నాడని కౌంటర్లు పేల్చుతున్నారు పాకిస్తాన్ అభిమానులు. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా అచ్చం ఇలాగే బాబర్ ఆజం సింగిల్ కోసం ప్రయత్నిస్తే, స్టివెన్ స్మిత్ రిజెక్ట్ చేసి అవమానించాడు. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డమీద స్మిత్ కు కూడా అదే అవమానం జరిగింది. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ ఓపెనర్ ఫర్హాన్ 38 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. అటు స్మిత ఐదు పరుగులకు ఔట్ అయ్యాడు.
Sahibzada Farhan has taken revenge on Steve Smith for insulting Bobby in BBL
— Jalal Haider (@jalalbalti) April 5, 2026