E-Paper
Advertisement

Inzamam-ul-Haq: కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు వెనుక కుట్ర‌లు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ

Inzamam-ul-Haq:  కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు వెనుక కుట్ర‌లు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ కు వర్షం విలన్ గా మారింది. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Kolkata Knight Riders vs Punjab Kings) మధ్య జరగాల్సిన 12వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కోల్కతాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వెనుక కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు. క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేసి, మ్యాచ్ రద్దు అయ్యేలా కుట్రలు పన్నారని ఆరోపణలు చేశారు. లేకపోతే కేకేఆర్ ఓడిపోయేదని వెల్లడించారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు వెనుక కుట్ర‌లు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య పన్నెండవ మ్యాచ్ నిన్న జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచి వర్షం దంచి కొట్టింది. ఆ తర్వాత కాస్త చల్లబడడంతో మ్యాచ్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కేకేఆర్, ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి జట్టైనా వర్షం పడితే కచ్చితంగా టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వెళ్ళింది. ఈ తరుణంలోనే మూడు ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు సాధించింది కేకేఆర్. కీలక వికెట్లు పడిపోయాయి. ఇలాంటి క్రమంలో వర్షం మొదలైంది. ఇక వర్షం ఏ మాత్రం తగ్గలేదు. అసలు ఒక్క మంది కూడా వేయడానికి చాన్స్ లేకపోవడంతో మ్యాచ్ మొత్తం రద్దు చేశారు. చెరో పాయింట్ ఇచ్చేశారు.

మ్యాచ్ రద్దు కావడంపై ఇంజమామ్ ఆరోపణలు

Advertisement

కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వెనుక కుట్ర కోణం ఉందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ బాంబు పేల్చారు. కావాలనే మ్యాచ్ జరిగేటప్పుడు క్లౌడ్ బరస్ట్ అయ్యేలా సీన్ క్రియేట్ చేశారని తెలిపారు. టాస్ గెలిచిన తర్వాత కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకోవడం దీని వెనుక కుట్రనే అని వివరించారు. రెండు వికెట్లు వరుసగా కోల్పోయిన నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం, షారుక్ ఖాన్ క్లౌడ్ బరస్ట్ పడేలా సీన్ క్రియేట్ చేశారని ఆరోపణలు చేశారు. దాంతో ఓడిపోయే మ్యాచ్ నుంచి కేకేఆర్ బయటపడింది. లేకపోతే పంజాబ్ చేతిలో కేకేఆర్ చిత్తుగా ఓడిపోయేది అని వెల్లడించారు. దీంతో ఇంజమాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై కేకేఆర్ కౌంటర్ ఇస్తోంది. క్లౌడ్ బరస్ట్ కాదని నిజమైన వర్షం అని పేర్కొంది.

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

Related News

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×