E-Paper
Advertisement

Ishan Kishan: ఇషాన్ కిష‌న్ కు కూడా తీవ్ర గాయం..ఓపెన‌ర్లు లేకుండానే టీమిండియా, శ్రేయాస్ అయ్య‌ర్ కు పిలుపు ?

Ishan Kishan: ఇషాన్ కిష‌న్ కు కూడా తీవ్ర గాయం..ఓపెన‌ర్లు లేకుండానే టీమిండియా, శ్రేయాస్ అయ్య‌ర్ కు పిలుపు ?

Ishan Kishan:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో టీమిండియా కు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే అభిషేక్ శర్మ జట్టులో ఉంటాడా? లేడా? అని టెన్షన్ లో అభిమానులు ఉంటే… ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా రేపు నమీబియాతో ఇండియా మ్యాచ్ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రాక్టీస్ లో మునిగిన ఇషాన్ కిషన్ కు ( Ishan Kishan ) తీవ్ర గాయమైoది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ( Jasprit Bumrah) వేసిన ఓ బంతి ఇషాన్ కిషన్ ( ishan kishan injured) బొటన వేలుకు బలంగా తగిలిందట. దీంతో ప్రాక్టీస్ చేస్తుండగానే కుప్పకూలాడు ఇషాన్ కిషన్. ఈ నేపథ్యంలోనే నమీబియాతో జరిగే మ్యాచ్ కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? లేడా ? అనే టెన్షన్ మొదలైంది. ఒకవేళ ఇషాన్ కిషన్ కూడా జట్టులో లేకపోతే టీమిండియాకు ( Team India) ఓపెనర్ల సమస్య తలెత్తనుంది. దీంతో ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

ఇషాన్ కిషన్ మ్యాచ్ కు దూరం అయితే ఎలా ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే అభిషేక్ శర్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కాగా.. ఇప్పుడు ఇషాన్ కిషన్ కు కూడా గాయమైంది. రేపు నమీబియాతో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ప్రాక్టీస్ చేసేందుకు గ్రౌండ్ లోకి దిగాడు ఇషాన్ కిషన్. ఈ సందర్భంగా బుమ్రా వేసిన ఓ బంతి అతని కాలుకు బలంగా తగిలింది. దీంతో కుప్పకూలాడు. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ ఆడతాడా ? లేదా ? అనేది తెలియదు. ఒకవేళ ఇషాన్ కిషన్ తుది జట్టులో లేకపోతే వాషింగ్టన్ సుందర్ కు ఛాన్స్ రానుంది. అప్పుడు సూర్య కుమార్ యాదవ్ ఓపెనర్ గా కూడా బరిలోకి దిగే ఛాన్సులు ఉంటాయి. లేదా తిలక్ వర్మకు ఓపెనర్ గా ఛాన్స్ ఇస్తారు. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ సమయం వరకు అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోతే శ్రేయాస్ అయ్యర్ ను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. అతడు టి20 ప్రపంచ కప్ జట్టులో లేకపోయినప్పటికీ.. బీసీసీఐ పిలిచే ఛాన్స్ ఉంది.

ఇండియా, న‌మీబియా జ‌ట్ల అంచ‌నా

India Probable XI: సంజు శాంసన్, ఇషాన్ కిషన్ /సుంద‌ర్‌ , తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

Namibia Probable XI: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), JJ స్మిత్, జేన్ గ్రీన్ (WK), డైలాన్ లీచెర్, రూబెన్ ట్రంపెల్‌మాన్, విల్లెం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో

 

Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×