E-Paper
Advertisement

Bhanuka Rajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

Bhanuka Rajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌
Advertisement

Bhanuka Rajapaksa:  టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ లో చిన్న జట్లు చుక్కలు చూపిస్తున్నాయి. నేపాల్, నమీబియా, నెదర్లాండ్స్ లాంటి బలమైన జట్లు రెచ్చిపోయి ఆడుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ఇండియన్ బ్యాటర్ల పై ( India) విషం కక్కారు శ్రీలంక ( Srilanka) ఆటగాడు భానుక రాజపక్సే. భారత ప్లేయర్లు ( Team India Players) ఆడే బ్యాట్లలో రబ్బర్లు ఉంటాయని… అందువల్లే అంత భయంకరంగా వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉంటారని సంచలన ఆరోపణలు చేశాడు శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే. దీంతో భానుక రాజపక్సే ( Sri Lankan player Bhanuka Rajapaksa) చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ జట్టును బ్లెం చేస్తూ శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే ( Sri Lankan player Bhanuka Rajapaksa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు అందరూ వాడే బ్యాట్లలో రబ్బర్లు ( rubber bats) ఉన్నాయని బాంబు పేల్చాడు. ఆ బ్యాటలో రబ్బర్లు ఉన్న నేపథ్యంలో భారీ సిక్సర్లు అలాగే బౌండరీలు కొడుతున్నారని ఫైర్ అయ్యారు. బంతి బ్యాట్ కు తగలగానే దూరాన వెళ్లి పడుతోందని వెల్లడించారు.

భారత బ్యాటర్లు ఎక్కువ శక్తిని ఉపయోగించకుండా… పవర్ జనరేట్ అయ్యేలా బ్యాట్లను రూపొందించారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. రబ్బర్ పొర బ్యాట్ పై ఉంటుందని దాని వల్ల ఇది సాధ్యమని పేర్కొన్నారు. అయితే శ్రీలంక ప్లేయర్లకు అందించే బ్యాట్లలో నాణ్యత తక్కువగా ఉంటుందని వివరించారు. మాకంటే ఇండియన్ బ్యాటర్లకు ఇచ్చే బ్యాట్లు అద్భుతం అన్నారు. ఇటీవల కాలంలో ఇండియన్ ప్లేయర్లు ఆడే భారీ ఇన్నింగ్స్ ఆడే నేపద్యంలో శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సేకు ఇండియా అదిరిపోయే కౌంటర్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియన్స్ వాడే బ్యాట్లపై శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సే హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. తమ ఇండియన్ క్రికెటర్లు వాడే బ్యాట్లలో ఎలాంటి రబ్బర్లు లేవని… ఇదంతా తప్పుడు ప్రచారమని శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్సేకు కౌంటర్ ఇస్తున్నారు. టీమిండియా జట్టును అవమానించేందుకు గాను ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇండియన్ ప్లేయర్లు కఠోర శ్రమతో ప్రాక్టీస్ చేసి.. జట్టును గెలిపిస్తున్నారని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×