E-Paper
Advertisement

Furqan Bhat-Palestine Flag: హెల్మెట్ పై పాలస్తీనా జెండా..భార‌త క్రికెటర్ కు నోటీసులు ​​జారీ

Furqan Bhat-Palestine Flag: హెల్మెట్ పై పాలస్తీనా జెండా..భార‌త క్రికెటర్ కు నోటీసులు ​​జారీ
Advertisement

Furqan Bhat-Palestine Flag: ఇండియాకు చెందిన దేశవాళీ క్రికెటర్ ఫుర్కాన్ భట్ ( Furqan Bhat ) వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియాకు చెందిన జాతీయ జెండాను అవమానించి, పాలస్తీనాకు చెందిన జెండాను త‌న‌ హెల్మెట్ పై వేసుకొని వివాదానికి తెర లేపాడు. ఈ నేపథ్యంలోనే ఫుర్కాన్ భట్ కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అత‌నిపై గ‌ట్టిగానే యాక్ష‌న్ తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ కు పోలీసులు నోటీసులు

Advertisement

జమ్మూ కాశ్మీర్ లోని శ్రీన‌గ‌ర్ కు చెందిన‌ స్టార్ క్రికెటర్ ఫుర్కాన్ భట్ సరికొత్త వివాదానికి తెరలేపాడు. తన హెల్మెట్ పై పాలస్తీనాకు చెందిన జెండా అంటించాడు. పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని క్రికెట్ కూడా ఆడాడు. జమ్మూ కాశ్మీర్ చాంపియన్స్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జనవరి ఒకటో తేదీన జమ్మూ ట్రైల్స్ బ్లేజర్ VS  జమ్మూ కాశ్మీర్ 11 జట్ల ( Jammu Trail Blazers VS Jammu Kashmir 11  ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో జమ్మూ కాశ్మీర్ 11 జట్టుకు చెందిన జమ్మూ కాశ్మీర్, తన హెల్మెట్ పై పాలస్తీనా జెండాను ప్రదర్శించాడు. ( Furqan Bhat-Palestine Flag)

దీంతో ఫుర్కాన్ భట్ ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై కొంత మంది జాతీయవాదులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. తన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ధరించిన నేపథ్యంలో క్రికెటర్ ఫుర్కాన్ భట్ కు ( Furqan Bhat )  జమ్మూ కాశ్మీర్ పోలీసులు సామాన్లు కూడా జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసులలో పేర్కొన్నారు పోలీసులు. ఒకవేళ దీనిపై క్రికెటర్ ఫుర్కాన్ భట్ స్పందించకపోతే అరెస్టుకు కూడా వెనకాడబోమని వెల్లడించారు అధికారులు.

పాలస్తీనా జెండా వివాదంపై పోలీసుల కీల‌క ప్ర‌క‌ట‌న‌

Advertisement

పాలస్తీనా జెండా వివాదంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. హెల్మెట్ పై పాలస్తీనా జెండా ఉండటంపై క్రికెటర్ ఫుర్కాన్ భట్ కు సమన్లు ​​జారీ చేసిన‌ట్లు వివ‌రించారు. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ సందర్భంగా కొత్త‌ సంవత్సర దినోత్సవం సందర్భంగా క్రికెటర్ ఫుర్కాన్ భట్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు పేర్కొన్నారు పోలీసులు. ఈ త‌రుణంలోనే JKCL నిర్వాహకుడు జాహిద్ భట్ ను సమన్లు ​​జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మ్యాచ్ సమయంలో జెండాను ఎందుకు ఉపయోగించారనే దానిపై విచార‌ణ చేస్తున్న‌ట్లు తెలిపారు పోలీసులు. రూల్స్ ప్ర‌కారం ఇండియాకు చెందిన వాళ్లు ఇలాంటి ప‌నులు చేయ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించారు పోలీసులు.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×