E-Paper
Advertisement

Jos Buttler On Rohit: రోహిత్ శ‌ర్మ ఔట్ కాగానే, TV ఆఫ్ చేస్తా

Jos Buttler On Rohit: రోహిత్ శ‌ర్మ ఔట్ కాగానే, TV ఆఫ్ చేస్తా
Advertisement

Jos Buttler On Rohit:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రతి మ్యాచ్ అద్భుతంగానే సాగుతోంది. మూడు మ్యాచ్ లు జరగగా ఇందులో అన్ని కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 78 పరుగులు చేసి రాణించాడు. ఈ ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఉద్దేశించి జోస్ బట్లర్ ( Jos Buttler) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినంత సేపు టీవీ ( TV) చూస్తానని.. ఆ తర్వాత ఆఫ్ చేస్తానని బాంబు పేల్చారు. అతని బ్యాటింగ్ అంటే అంత ఇష్టమని వ్యాఖ్యానించారు. దీంతో జోస్ బ‌ట్ల‌ర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యల‌పై రోహిత్ శ‌ర్మ ( Rohit Sharma) ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

రోహిత్ శ‌ర్మ ఔట్ కాగానే, TV ఆఫ్ చేస్తా

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ , ప్రస్తుత ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ పైన ఇంగ్లాండ్ డేంజర్ ప్లేయర్ జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా తన ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ శర్మ అని తెలిపారు. తాను ఎప్పుడు కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆడడం చూస్తూ ఉంటానని వివరించారు. అతని బ్యాటింగ్ చూడడమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ ఆడే ప్రతి షాట్ తనకు నచ్చుతుందని వెల్లడించారు. అందుకే రోజులో ఒక్కసారైనా రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తానని తెలిపారు. నేను సాధారణంగా టీవీ ఎక్కువగా చూడను… కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమే చూస్తానని వివరించారు జోస్ బట్లర్ ( Jos Buttler). అతడు పరుగులు చేసినంత సేపు టీవీ చూడాలని ఆసక్తి ఉంటుందన్నారు. ఎప్పుడైతే రోహిత్ శర్మ ఔట్ అవుతాడో ఆ వెంటనే టీవీ ఆఫ్ చేస్తానని తెలిపారు. మళ్లీ ఇక మిగిలిన మ్యాచ్ చూడబోనని వెల్లడించారు.

ఐపీఎల్ 2026 లో అదరగొట్టిన రోహిత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ 78 పరుగులతో రాణించాడు. దాదాపు 24 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ఆరు సిక్సర్లు ఆరు బౌండరీలు కొట్టి 205 స్ట్రైక్ రేట్ సంపాదించాడు. ఈ దెబ్బకు అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది ముంబై ఇండియన్స్.

Advertisement

 

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×