E-Paper
Advertisement

బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే
Advertisement

PSL Ball Tampering: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Pakistan Super League 2026 ) బాల్ టాంపరింగ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. లాహోర్ వర్సెస్ కరాచీ జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరగగా, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్ ను బాల్ టాంపరింగ్ కు ( BALL-TAMPERING ) పాల్పడ్డారు. కెప్టెన్ షాహీన్ అఫ్రిది ( Shaheen Shah Afridi) ఆధ్వర్యంలో ఫఖ‌ర్ జమాన్ ఈ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. దీంతో షాహీన్ అఫ్రిది, హరిస్ ర‌వూఫ్‌, ఫఖ‌ర్‌ జమాన్ పై బ్యాన్ విధించే అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇప్పటి వరకు బాల్ టాంపరింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ క్రికెటర్ల లిస్టు కూడా వైరల్ గా మారింది.

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

బాల్ టాంపరింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ ఆటగాళ్లు

Advertisement

పాకిస్తాన్ అంటేనే బాల్ టాంపరింగ్ అన్నట్లుగా వ్యవహారం తయారైంది. చాలా మంది ఇప్పటికే ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారంలో చిక్కుకున్నారు. 2000 సంవత్సరంలో బాల్ టాంపరింగ్ కు పాల్పడిన మొదటి ఆటగాడిగా ఒకసారి వకార్ యూనిస్ ( Waqar Younis ) నిలిచాడు. అయితే ఈ బాల్ టాంపరింగ్ కు పాల్పడినందుకు ఒక వన్డే ఆడకుండా చర్యలు తీసుకున్న ఐసీసీ 50% ఫీజులో కోత విధించింది. ఇక 2006లో ఇంజమామ్ ఉల్ హ‌క్ కూడా బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. దీంతో నాలుగు వ‌న్డేలు ఆడకుండా అతనిపై చర్యలు తీసుకుంది ఐసీసీ.

మొట్ట మొదటిగా షాహిద్ ఆఫ్రీది 2010లో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. నోట్లో బంతిని పెట్టుకుని గట్టిగా కొరికేశాడు. అది కెమెరాల చిక్కడంతో రెండు టీ20లు ఆడకుండా అప్పట్లో ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా షాహీన్ అఫ్రిది ఆధ్వర్యంలో ఫఖ‌ర్ జమాన్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. ఇక ఈ సందర్భంగా జమాన్ పై 14 మ్యాచ్ లు ఆడకుండా బ్యాన్ విధించే ప్రమాదం పొంచి ఉంది. అటు కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి కూడా పనిష్మెంట్ తప్పదని అంటున్నారు.

బాల్ టాంపరింగ్ కు పాల్పడిన ఇత‌ర కెప్టెన్లు

Advertisement

మెజారిటీ పాకిస్తాన్ క్రికెటర్లు బాల్ టాంపరింగ్ కు పాల్పడితే.. ఇతర దేశాల క్రికెటర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇందులో స్టీవెన్ స్మిత్ కూడా బాల్ టాంపరింగ్ కేసులో ఇరుక్కున్నాడు. 2018 సంవత్సరంలో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ బాన్ క్రాఫ్ట్ సాండ్ పేపర్ తో బంతిని (sandpaper tampering) రుద్దడం జరిగింది. అయితే డేవిడ్ వార్నర్ చెప్పినందుకు గానే ఈ సాండ్ పేపర్ రుద్దినట్లు ఆస్ట్రేలియా ఆటగాడు బాన్ క్రాఫ్ట్ వెల్లడించాడు. ఆ సమయంలో స్టీవెన్ స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు. దీంతో ముగ్గురు పైన వేటు వేసింది ఐసీసీ. స్టీఫెన్ స్మిత్ పైన ఏడాది కాలం పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ నిషేధం విధించింది.

అటు కెప్టెన్సీ కూడా పోయింది. ఈ బాల్ టాంపరింగ్ కారణంగా భవిష్యత్తులో స్టీవెన్ స్మిత్ కు కెప్టెన్సీ ఇవ్వకూడదని కూడా ఐసీసీ ఆదేశించింది. అదే సమయంలో డేవిడ్ వార్నర్ పైన ఏడాది కాలం బ్యాన్ విధించిన ఐసీసీ, ఇటు బాన్ క్రాఫ్ట్ పైన 9 నెలల నిషేధం విధించింది. 2013, 2016 సంవత్సరాలలో ఫాప్ డూప్లిసిస్ కూడా టాంపరింగ్ కు పాల్పడి, ఐసీసీ విధించిన శిక్షను అనుభవించాడు. 2013లో బాల్ టాంపరింగ్ చేసినప్పుడు 50% మ్యాచ్ ఫీజు లో ఫైన్ విధించిన ఐసీసీ, 2016లో మ్యాచ్ ఫీజు మొత్తం కట్ చేసింది. కానీ అతనిపై బ్యాన్ మాత్రం విధించలేదు ఐసీసీ.

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×