E-Paper
Advertisement

CAG Report: తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీ.. కాగ్ రిపోర్టులో విస్తుపోయే సంచలనాలు

CAG Report: తెలంగాణ ఖజానా మొత్తం ఖాళీ.. కాగ్ రిపోర్టులో విస్తుపోయే సంచలనాలు
Advertisement

CAG Report: స్వేచ్ఛ బ్యూరో: ఆదాయ మార్గాలను అన్వేషించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. టార్గెట్ లో కేవలం 75 శాతం మాత్రమే అందుకోగల్గుతుందని కాగ్ 2024–2025లో పేర్కొన్నది. కానీ ప్రభుత్వ నిర్వహణ వంటి వాటి కోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి మాత్రం వంద శాతం లోన్లను పొందగల్గుతున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదాయం ఆశించిన స్థాయిలో చేరకపోవడంతో సంక్షేమ పథకాలు అమలు, డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ డీలే అవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 2024–2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 2.21 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది. కానీ కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటతో కలిపి రూ. 1.67 లక్షల కోట్లను మాత్రమే చేరుకోగల్గింది.

పాత అప్పులు..

దీంతో వచ్చిన ఆదాయాన్ని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు, పాత అప్పులకే ఖర్చు చేయాల్సి వచ్చినట్లు కాగ్ తన రిపోర్టులో పేర్కొన్నది. 2024–2025లో ఉద్యోగుల జీతాలకు రూ. 37,521 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ల నిమిత్తం రూ. 16,942, పాత అప్పుల రీపేమెంట్(వడ్డీలు కలిపి) దాదాపు రూ. 27 వేల కోట్లకు పైనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆశించిన మొత్తంలో ఆదాయం రాకపోవడందో పథకాల ఇంప్లిమెంట్ లో ప్రభుత్వం ముందుకు వెనక్కి తడబడినట్లు కాగ్ స్పష్టం చేసింది. మరోవైపు 2024–2025 ఆర్​ధిక సంవత్సరంలో ఆర్ బీఐ, పబ్లిక్ డెప్ట్ రూపంలో దాదాపు రూ. 1.89 లక్షల కోట్లు లోన్లు తీసుకోగా, వీటిలో తిరిగి రూ. 1.42 లక్షల కోట్లను ప్రభుత్వం చెల్లించింది.

నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు..

Advertisement

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లోకి వెళ్తున్నట్లు కాంగ్ తన రిపోర్టులో పేర్కొన్నది. రాష్ట్రంలో 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 16 సంస్థలు మూతపడం, లిక్విడేషన్‌లో ఉన్నట్టు కాగ్ పేర్కొన్నది. 67 పని చేస్తున్న సంస్థల్లో 49 సంస్థలు ఖాతాలు సమర్పించడంలో ఆలస్యం చేసినట్లు స్పష్టం చేసింది. దీంతో కేవలం 18 సంస్థల పనితీరును మాత్రమే విశ్లేషించినట్లు కాగ్ వివరించింది. అయితే 2024–2025 ఆర్ధిక సంవత్సరంలో ఈ 18 సంస్థల టర్నోవర్ రూ.95,204 కోట్లుగా ఉన్నట్లు వివరించింది. 18 సంస్థల్లో 11 నష్టాల్లో, కేవలం 6 సంస్థలు లాభాల్లో ఉన్నాయని కాగ్ పేర్కొన్నది. మొత్తం పెట్టుబడులు రూ.98,572 కోట్లుగా నమోదు కాగా, 9 సంస్థల నెట్‌విలువ పూర్తిగా నష్టాలతో కరిగిపోయినట్టు కాగ్ చెప్పింది. నెట్‌విలువ ఏకంగా – రూ.50,930(మైనస్) కోట్లుగా తగ్గిపోయినట్లు కాగ్ వివరించింది. 15 సంస్థల్లో 9 సంస్థలు స్వతంత్ర డైరెక్టర్ల నియామకం చేయలేదని కాగ్ వెల్లడించింది. ఎక్కడా ఇండిపెండెంట్ డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదన్నది. 5 సంస్థల్లో ఆడిట్ కమిటీ , 9 సంస్థల్లో ఎన్ ఆర్ సీ కమిటీ ఏర్పాటు కాలేదని వివరించింది. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరును వెంటనే సమీక్షించి, కీలక నిర్ణయాలు తీసుకోఆల్సిన అవసరం ఉన్నదని కాగ్ స్పష్టం చేసింది.

Also read: అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గలాబీలో ఇప్పుడిదే హట్ టాపిక్..?

సింగరేణి కంపెనీపై ప్రత్యేక ఆడిట్..

Advertisement

సింగరేణి కంపెనీపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని కాగ్ తెలిపింది. అయితే సింగరేణి కోల్ కంపెనీలో డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలు గుర్తించారు. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగాన్ని గుర్తించారు. కాంట్రాక్టుల్లో లోపాల వల్ల రూ. 251 కోట్ల అనవసర ఖర్చు పెట్టారని కాగ్ ప్రశ్నించింది. ఒప్పంద నిబంధనలు అమలు కాక రూ.74 కోట్ల అదనపు భారం పడినట్లు కాగ్ వెల్లడించింది. తద్వారా కోల్ రవాణాలో లోపాలు ఏకంగా రూ. 25 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేగాక ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల వల్ల రూ. 1,078 కోట్ల అదనపు వసూళ్లు చేశారు. మరోవైపు పర్యావరణ నిబంధనలు పాటించలేదు.

కాగ్ గుర్తించిన మరి కొన్ని అంశాలు..

ఇక తెలంగాణలో లైబ్రరీ సెస్సు 324.96 కోట్లు సరిగా వసూలు కాలేదన్నారు. జీహెచ్ ఎంసీ వద్ద టిప్పింగ్ ఫీజు రూ. 47.77 కోట్లు వసూల్ కాలేదు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భారీ లోపాలు ఉన్నట్లు కాగ్ పేర్కొన్నది. చెత్త వర్గీకరణ లక్ష్యం అమలు కాలేదు.మిక్స్‌డ్‌గా చెత్త రవాణా, డంపింగ్ జరుగుతున్నట్లు ఆడిట్‌లో వెల్లడించారు. వ్యర్థ సేకరణలో రాగ్ పికర్స్‌కు ప్రభుత్వ సహకారం లేదు. అంతేగాక ప్రాసెస్ చేయని చెత్తకు రూ. 313.20 కోట్లు చెల్లింపులు జరిగాయి. డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ జరగకపోయినా కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేశారని కాగ్ కడిగిపడేసింది. ఎన్‌విరాన్‌మెంట్ ఫండ్ ను కమిషనర్ ఏర్పాటు చేయలేదు. ల్యాండ్‌ఫిల్ సైట్ల కోసం భూముల కేటాయింపు లేదు. 50 శాతం కంటే ఎక్కువ చెత్త ఓపెన్ డంప్‌యార్డ్స్‌లో పడేయడం లేదు.

37 శాతం నిధులు

జీడిమెట్ల, ఫతుల్లగూడలో లక్షల టన్నుల చెత్త నిల్వ ఉండగా, మానిటరింగ్ లోపం ఉన్నట్లు కాగ్ వివరించింది. 2.29 కోట్లు ఎన్‌విరాన్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు నష్టం జరిగిందని కాగ్ తెలిపింది. 37 శాతం నిధులు వినియోగం కాకుండా మిగిలిపోయాయి. కేంద్రం నుంచి నేరుగా స్టేట్ ఏజెన్సీలకు నిధుల బదిలీ అయినట్లు కాగ్ గుర్తించింది. సివిల్ సప్లైస్, అగ్రికల్చర్, ఆరోగ్య ట్రస్ట్‌లకు నిధుల యాడ్ అయినట్లు పేర్కొన్నది. కానీ రూ. 9,723 కోట్ల నిధులు స్టేట్ అకౌంట్స్‌లో పొందుపరచలేదని కాగ్ తెలిపింది. 31,229 కోట్ల నెట్ అదనపు ఖర్చు నమోదు అయింది. ఫిస్కల్ అడ్మినిస్ట్రేషన్ గ్రాంట్‌లో రూ. 10,525 కోట్ల అధిక వ్యయం, పబ్లిక్ డెబ్ట్ సెక్షన్‌లో రూ.20,527 కోట్ల అధిక ఖర్చు జరిగినట్లు తెలిసింది. అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలక్షన్స్‌లో బడ్జెట్‌కు మించి ఖర్చు అయిన్నట్లు కాగ్ వెల్లడించింది.

Also Read: రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి.. రాజీనామా వెనుక పెద్ద ప్లానే..!

2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి..

రెవెన్యూ లోటు – ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటును నమోదు చేసింది.2023-24 లో ని రూ. 779 కోట్ల మిగులుతో పోలిస్తే ఇది గణనీయమైన మార్పుగా కాగ్ గుర్తించింది.
ద్రవ్య లోటు – రాష్ట్ర ద్రవ్య లోటు రూ.48,922 కోట్లుగా ఉంది.ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్ డీపీలో) లో 2.98 శాతానికి సమానం. ఇది అంటే ఎఫ్​ ఆర్ బీఎమ్ చట్టం నిర్దేశించిన 3 శాతం పరిమితి లోపే ఉన్నాయి.
ఆదాయ వనరులు – రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఆదాయం రూ. 1,67,804 కోట్లు. ఇందులో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,36,283 కోట్లు కాగా, పన్నేతర ఆదాయం రూ.23,608 కోట్లుగా ఉంది.
ప్రభుత్వ అప్పులు – 2024-25 చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పులు రూ. 4,47,493 కోట్లు . ఇది జీఎస్ డీపీ లో 27 శాతంగా ఉంది .
ప్రధాన ఖర్చులు –రాష్ట్ర ప్రభుత్వం తన రెవెన్యూ ఆదాయంలో దాదాపు 49 శాతాన్ని అంటే జీతాలకు రూ. రూ.37,521 కోట్లు, పెన్షన్లు రూ,16,942 కోట్లు, వడ్డీ చెల్లింపుల రూ. 27,803 కోట్లుగా ఉన్నాయి.
పెట్టుబడి వ్యయం – ఆస్తుల కల్పన కోసం చేసిన వ్యయం రూ.36,072 కోట్లుగా నమోదైంది.

Also Read: మంగళవారం ఆ పనులు అసలు చేయకూడదట..?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×