Kamran Akmal: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Bangladesh vs Pakistan, 1st Test) మధ్య ప్రస్తుతం మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం (Shere Bangla National Stadium, Dhaka) వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మరో 190 పరుగులు సాధిస్తే పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మరో నాలుగు గంటల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో డ్రా కావడం గ్యారెంటీ అంటున్నారు. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal). పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడే టెస్ట్ మ్యాచ్ చెత్తగా ఉందని.. పరమ బోరింగ్ అంటూ వ్యాఖ్యానించారు. ఒక్కడికి కూడా సరిగ్గా క్రికెట్ ఆడటం రావడంలేదని మండిపడ్డారు. టెస్ట్ క్రికెట్ కంటే ప్రతి సంవత్సరం మూడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లకు దద్దమ్మలకు టెస్ట్ క్రికెట్ ఆడటం చేతకాదని, వెంటనే పీఎస్ఎల్ నిర్వహిస్తే, బాగుంటుందని సలహాలు చేశారు.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test) మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చాలా బోరింగ్ గా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ బాగానే ఆడుతున్నప్పటికీ… పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ సభ్యులు మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ జట్టు ఆడే తీరు చూస్తుంటే తనకు భయమేస్తోందని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. క్రికెట్ అంటే విరక్తి పుట్టేలా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన కనబరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కమ్రాన్ అక్మల్. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూడాలంటే.. తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదికి మూడుసార్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో నిర్వహించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు వింత డిమాండ్ పెట్టారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ఇకపైన టెస్టులు ఆడించకూడదని కోరారు. వెంటనే PSL టోర్నమెంట్లు నిర్వహించి.. పాకిస్తాన్ క్రికెట్ ను కాపాడాలని డిమాండ్ చేశారు కమ్రాన్ అక్మల్. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 413 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 240 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అటు పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేయగా.. రిటైన్నింగ్స్ లో పోరాడుతోంది. మరో 190 పరుగులు చేస్తే విజయం సాధించనుంది.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
🚨 Pakistan to be relegated from Test cricket?
“The way the Pakistan cricket team played in the first Test against Bangladesh, I’m afraid the PCB may have to organise three PSL seasons a year just to keep fans interested. At this rate, I won’t be surprised if Pakistan eventually… pic.twitter.com/WYFy1Qnv2W
— Brutal Truth (@sarkarstix) May 12, 2026