PAK VS BAN: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో అటు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan, 1st Test,) మధ్య టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభమైంది. నిన్న ఢాకా వేదికగా ( Shere Bangla National Stadium, Dhaka) తొలి టెస్ట్ ప్రారంభం కాగా బంగ్లాదేశ్ 413 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించి, అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్తోంది. ఇలాంటి క్రమంలో ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ అలాగే ఇతర ఇండియన్ క్రికెటర్లు పాకిస్తాన్ జట్టులో ఉన్నట్లు స్కోర్ బోర్డులో చూపించారు. ఈ పాకిస్తాన్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ అన్నట్లుగా చూపించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో హాట్ టాపిక్ అయింది.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా దారుణంగా పాకిస్తాన్ బౌలర్ల పై ట్రోలింగ్ జరుగుతోంది. స్పిన్నర్ల లాగా బౌలింగ్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఉదయం నుంచి ఆడుకుంటున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది బౌలింగ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో మరో ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్ తో ఆడుతున్న పాకిస్తాన్ జట్టులో రోహిత్ శర్మ, గిల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ లాంటి 11 మంది ప్లేయర్లు అందరూ ఉన్నట్లు చూపించారు. ఇందులో పాకిస్తాన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అన్నట్లుగా గ్రాఫిక్ ప్లేట్ పైన ప్రదర్శించారు. దీంతో ఇండియన్ క్రికెటర్లందరూ పాకిస్తాన్ జట్టులోకి ఎప్పుడు వెళ్లారని అభిమానులు షాక్ అవుతున్నారు.
ఎప్పుడో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ… పాకిస్తాన్ కు ఎలా ? ఆడుతున్నాడని ప్రశ్నిస్తున్నారు. అయితే వాస్తవానికి టీమిండియా క్రికెటర్లు ఏమి… పాకిస్తాన్ జట్టులోకి వెళ్లలేదు. ఢాకా క్రికెట్ స్టేడియానికి సంబంధించిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాకిస్తాన్ స్కోర్ బోర్డులో టీమిండియా ప్లేయర్ల పేర్లు ప్రదర్శించారు. ఆ సిబ్బంది తప్పిదమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇండియన్ క్రికెటర్లు పాకిస్తాన్ లోకి వెళ్లారని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత పెద్ద తప్పిదం క్రికెట్ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదని.. ఇది కేవలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వల్ల మాత్రమే సాధ్యమంటూ దారుణంగా ఆడుకుంటున్నారు. ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఒక్క టీమిండియా ప్లేయర్ వేస్తారు.. కానీ వీళ్లు 11 మంది ప్లేయర్ల పేర్లు వేయడం దారుణమంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ
?igsh=aTVzZXZxNmphNXMz
Bro wtf is this …….
During a Pakistan vs Bangladesh Test match in Dhaka, the TV broadcast showed a wrong graphic.
It said "Pakistan Test Career" but listed Indian players (like Rohit Sharma, Shubman Gill, Axar Patel, etc.) with their stats.
It was a big mistake by the… pic.twitter.com/qraH5RS8Zf
— ExtraOrdinary (@Extreo_) May 9, 2026