E-Paper
Advertisement

PSL 2026 టోర్న‌మెంట్ కు బ్రేక్‌…ప్లేయ‌ర్ల‌కు వారం రోజులు హాలిడేస్

PSL 2026 టోర్న‌మెంట్ కు బ్రేక్‌…ప్లేయ‌ర్ల‌కు వారం రోజులు హాలిడేస్
Advertisement

PSL 2026 Holidays:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మంచి వ్యూయర్షిప్ తో దూసుకు వెళ్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 ) మాత్రం అభిమానులు లేకుండానే నిర్వహిస్తున్నారు. దానికి తోడు ఈ టోర్నమెంట్ లో రోజుకో ఒక వివాదం తెరపైకి వస్తోంది. నసీమ్ షా పెట్టిన వివాదాస్పద పోస్ట్ నుంచి మొదలుకొని బాల్ టాంపరింగ్ వరకు అన్ని వివాదాలే. ఒక్కో మ్యాచ్ కు ఒక్కో వివాదం అన్నట్లుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతోంది. అయితే లేటెస్ట్ గా మరో ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్లేయర్లకు హాలిడేస్ ( Holidays For PSL ) ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే అన్ని జట్లకు కాకుండా కేవలం కరాచీ కింగ్స్ లో ( Karachi Kings ) ఉన్న కొంతమంది ప్లేయర్లకు సెలవులు ఇచ్చింది యాజమాన్యం. ఈ సంఘటనకు సంబంధించి న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడే ప్లేయర్లకు హాలిడేస్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఇప్పటి వరకు పదికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కరాచీ కింగ్స్ జట్టు టాప్ లో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో డేవిడ్ వార్నర్ సేన మూడింటిలో గెలిచింది. దీంతో పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కరాచీ కింగ్స్ ఉంది. అయితే ఈ కరాచీ కింగ్స్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లకే తాజాగా హాలిడేస్ ప్రకటించారు. ఇందులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ ( David Warner) కూడా ఉన్నారు. తన ఫ్యామిలీతో వారం రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును డేవిడ్ వార్నర్ వదిలేస్తున్నాడు. ఆ తర్వాత ఇదే జట్టుకు సంబంధించిన ఆడమ్ జంపా ( Adam Zampa) కూడా వెకేషన్ వెళ్తున్నాడు. ఇతను కూడా దాదాపు వారం రోజులు పాకిస్తాన్ వదిలి సింగపూర్ వెళ్తాడని అంటున్నారు.

తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదో ఫంక్షన్ కారణంగా హసన్ అలీ కూడా జట్టుకు వారం రోజులు దూరం అవుతాడు. అజాం ఖాన్ మరో ఇద్దరు ప్లేయర్లు కూడా వెళ్తారని తెలుస్తోంది. వేసవి సెలవులు తీసుకుంటున్న ఈ ప్లేయర్లు మళ్ళీ ఏప్రిల్ 9వ తేదీన అంటే వారం రోజుల వరకు తిరిగి జట్టులో చేరుతారు. వీళ్ళు వచ్చిన తర్వాత పేషవారు జల్మీతో కరాచీ కింగ్స్ మ్యాచ్ ఆడనుంది. అయితే టోర్నమెంట్ మధ్యలో ప్లేయర్లకు హాలిడేస్ ఇవ్వడం పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఐపీఎల్ లో ఇలాంటి సౌకర్యాలు లేవని.. పాకిస్తాన్ లో మాత్రమే ఇలా ప్లేయర్లకు సెలవులు లభిస్తాయని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. జనాలు ఎవ్వరూ ఈ టోర్నమెంట్ చూడడం లేదని.. అందుకే హాలిడేస్ ఇస్తున్నట్లు ర్యాగింగ్ చేస్తున్నారు. కొంత మంది ప్లేయర్లకు కాకుండా అందరికీ హాలిడేస్ ఇచ్చి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును నిషేధించండి అని మరి కొంతమంది ఆడుకుంటున్నారు.

Advertisement

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×