E-Paper
Advertisement

జీమెయిల్ యూజర్లకు బిగ్ అప్డేట్.. ఐడీ సింపుల్ గా మార్చుకోవచ్చు.

జీమెయిల్ యూజర్లకు బిగ్ అప్డేట్.. ఐడీ సింపుల్ గా మార్చుకోవచ్చు.
Advertisement

Gmail ID Change: గూగుల్ జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జీమెయిల్ ఫీచర్ అందుబాటులోకి తెస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు జీమెయిల్ అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఇప్పటివరకు @gmail.comతో ఉన్న ఐడీలకు అడ్రస్ మార్పునకు అనుమతి లేదు. కానీ, కొత్త ఫీచర్ లో ఐడీని మార్చుకోవచ్చు. ఇ-మెయిల్ చిరునామాలను మార్చుకోవచ్చని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మార్చి 31న ‘ఎక్స్’లో ప్రకటించారు.

పాత డేటా పోకుండానే

ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు బిలియన్ల మంది యాక్టివ్ జీమెయిల్ వినియోగదారులు ఉన్నారు. Gmail అడ్సస్ చివరలో పెట్టుకున్న నెంబర్లు, ఇతర పేర్లు అంటే ఉదాహరణకు Hyderabad2004@gmail.com లేదా mrbrightside416@gmail.com ఇలాంటివి ఇక వదిలించుకోవచ్చు. మీ Google అకౌంట్ సెట్టింగ్‌లకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఏదైనా పేరును సెలెక్ట్ చేసుకోవచ్చు. 2004లో జీమెయిల్ ప్రారంభమైనప్పటి నుంచి మెయిల్ ఐడీ ఛేంజ్ కు అనుమతి లేదు. తాజాగా పాత డేటా కోల్పోకుండానే మెయిల్ ఐడీ అడ్రస్ ను అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి రానుంది.

జీమెయిల్ అడ్రస్ ఎలా మార్చుకోవాలి?

  • జీమెయిల్ న్యూ ఫీచర్ మొదటిగా అమెరికాతో ప్రారంభిస్తారు. అనంతరం దశలవారీగా వివిధ దేశాల్లో అమలు చేయనున్నారు. భారతదేశంలో ఎప్పుడు అమలులోకి వస్తుందో గూగుల్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. .
  • మీ జీమెయిల్ అకౌంట్ కు వెళ్లండి.
  • ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
  • మేనెజ్ లో యువర్ గూగుల్ అకౌంట్ పై క్లిక్ చేయండి.
  • కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటే ‘ఇ-మెయిల్‌ను మార్చండి’ ఆప్షన్ పై నొక్కండి
  • కొత్త యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేసి, అవైలబిలిటీని చెక్ చేయండి.
  • కొత్త మెయిల్ అడ్రస్ ను సేవ్ చేయండి
  • మీ పాత Gmail ID లాక్ అవుతుంది. దానిని వేరొకరు నమోదు ఉపయోగించలేరు.
Advertisement

Also Read:  చదవగానే డెలీట్ అయిపోయే రహస్య జిమెయిల్.. పాస్‌కోడ్‌తో సురక్షితంగా ఇలా పంపించండి

Related News

డార్క్ వెబ్‌లో SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్.. అకౌంట్లు సురక్షితమేనా?

బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

రూ.13,699కే ఫుల్ హెచ్‌డీ టీవీ!మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

బడ్జెట్ గేమింగ్ హెడ్‌ఫోన్..మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో లాంచ్

రూ. 35,990కే నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ టీవీ..ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవిగో

రూ. 9,990కే బడ్జెట్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్!

ఏకంగా 44% డిస్కౌంట్‌తో బెస్ట్ వాషింగ్ మెషీన్!డోంట్ మిస్

రూ.2,099కే ల్యాప్‌టాప్ ఛార్జ్ చేసే..పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్!

Big Stories

Advertisement
×