Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League Tournament 2026), అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ ( PSL 2026) అద్భుతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. రెండు ఒకేసారి కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ సమ్మర్, క్రికెట్ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. ఇక తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న సాహిబ్‌జాదా ఫర్హాన్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే సాహిబ్‌జాదా ఫర్హాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా బౌలింగ్ లో ఆరు వంతుల్లో 6 సిక్సర్లు కొట్టే మొనగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) ఒక్కడేనని తెలిపారు. ఒకవేళ బుమ్రా ( bumrah) బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టకపోతే పాకిస్తాన్ బార్డర్ లో బట్టలు లేకుండా తిరుగుతానని ఛాలెంజ్ విసిరాడు ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ). దీంతో ఎంజాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే నరకం, డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వరు..అందుకే పారిపోయి పాకిస్తాన్ వచ్చా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో డేంజర్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ సెంచరీ నమోదు చేశాడు. బుధవారం రోజున ముల్తాన్ సుల్తాన్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 57 బంతుల్లోని 106 పరుగులు చేశాడు సాహిబ్‌జాదా ఫర్హాన్. ఈ క్రమంలో సాహిబ్‌జాదా ఫర్హాన్ ఇన్నింగ్స్ పైన స్పందించాడు ఇంజమామ్. ప్రపంచంలోనే డేంజర్ ఆటగాడిగా ఫర్హాన్ మిగిలిపోతాడని పేర్కొన్నారు. ఇలాంటి ఆటగాడు ఇండియాలో కూడా ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. బుధవారం రోజున సాహిబ్‌జాదా ఫర్హాన్ సెంచరీ చేస్తే.. సోషల్ మీడియాలో కేవలం 70 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ సమీర్ రిజ్వి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును గెలిపించినందుకు గాను సమీర్ రిజ్విని పొగుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో సెంచరీ చేసిన ఫర్హాన్ గురించి ఎక్కడ మాట్లాడుకోవడం లేదని సీరియస్ అయ్యారు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఫర్హాన్ గురించి పోస్టులు కూడా పెట్టడం లేదని మండిపడ్డారు ఇంజమామ్. ఇదంతా బీసీసీఐ కుట్ర అని నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును అనగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.
బుధవారం జరిగిన ముల్తాన్ సుల్తాన్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen, ) మధ్య మ్యాచ్ లో సెంచరీతో రెచ్చిపోయాడు ఫర్హాన్. కేవలం 57 బంతుల్లో 106 పరుగులు సాధించాడు. ఇందులో 8 సిక్సర్లు, 7 బౌండరీలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ కింగ్స్ మెన్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముల్తాన్ సుల్తాన్స్. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 225 పరుగులు సాధించింది హైదరాబాద్. ఈ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది ముల్తాన్ సుల్తాన్స్.
Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే నరకం, డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వరు..అందుకే పారిపోయి పాకిస్తాన్ వచ్చా
🚨 HUGE STATEMENT BY INZAMAM UL HAQ ON IPL VS PSL POPULARITY 🚨
"Yesterday, Sahibzada Farhan scored a brilliant 100 while chasing, but no one is talking about him. Everyone is busy with the IPL, and Sameer Rizvi is the talk of the town." 😂#LSGvsDC pic.twitter.com/O8gOFVsMMP
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) April 2, 2026