E-Paper
Advertisement

KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 99% సక్సెస్ రేటు.. గిల్ దండగే, తొల‌గించాల‌ని డిమాండ్స్ !

KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 99% సక్సెస్ రేటు.. గిల్ దండగే, తొల‌గించాల‌ని డిమాండ్స్ !
Advertisement

KL Rahul: భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ సమయంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ శుభమన్ గిల్ గాయపడ్డ కారణంగా.. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కి దూరమయ్యాడు. దీంతో కెప్టెన్సీ పగ్గాలను వికెట్ కీపర్ కే.ఎల్ రాహుల్ చేతికి అప్పగించింది బీసీసీఐ.

Also Read: Kohli – Rohit: అఫ్రిది రికార్డు బ్రేక్.. 352 సిక్సర్లతో రోహిత్ హిస్టరీ.. విరాట్ కోహ్లీ సెంచరీ

Advertisement

3 వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే రాంచీలోని జె.ఎస్.సి.ఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరిగింది. ఈ తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై భారత్ గెలుపొందింది. దీంతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0 ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కెప్టెన్ కే ఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.

 

కలిసొచ్చిన కే.ఎల్ రాహుల్ కెప్టెన్సీ:

Advertisement

టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కి వన్డేలలో అద్భుతమైన రికార్డ్ ఉంది. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి వన్డే లోనే విఫలమైనప్పటికీ.. ఆ తరువాత కే.ఎల్ రాహుల్ అజేయంగా నిలిచాడు. వన్డేలలో కే.ఎల్ రాహుల్ ఇప్పటివరకు 13 మ్యాచ్ లకు కెప్టెన్సీ చేశాడు. ఇందులో టీమిండియా తొమ్మిది మ్యాచ్ లలో గెలుపొంది.. కేవలం నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది. కే.ఎల్ రాహుల్ తొలిసారి 2022లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 వన్డే ల సిరీస్ కి కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ని ఇండియా 0 – 3 తో కోల్పోయింది. ఆ తర్వాత వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకు కే.ఎల్ రాహుల్ కెప్టెన్సీ చేసిన 10 మ్యాచ్ లలో భారత జట్టు ఏకంగా 9 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఓవరాల్ గా కె.ఎల్ రాహుల్ 13 వన్డేల్లో ఇండియాకు కెప్టెన్సీ చేశాడు. వీటిలో టీమిండియా 9 మ్యాచ్ లలో గెలుపొంది.. మరో నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది. చివరిసారిగా కేఎల్ రాహుల్ 2023 డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికా టూర్ లో కెప్టెన్సీ చేశాడు. సౌత్ ఆఫ్రికా పై మూడు వన్డేల సిరీస్ ని ఇండియా 2 -1 తో గెలుచుకోవడం విశేషం.

 

బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రాణించిన రాహుల్:

కెప్టెన్ గా ఆడినప్పుడు కే.ఎల్ రాహుల్ బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రాణించాడు. బ్యాటర్ గా ఆడిన 11 ఇన్నింగ్స్ లలో 362 పరుగులు చేశాడు. యావరేజ్ 45.46 ఉంది. వీటిలో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే రాహుల్ కెప్టెన్సీలో తొలిసారి ఓడింది కూడా సౌత్ ఆఫ్రికా చేతిలోనే కావడం గమనార్హం. ఇక టెస్టుల్లో కూడా కేఎల్ రాహుల్ కి అద్భుతమైన రికార్డు ఉంది.

Also Read: Chew Gum: క్రికెటర్లు ఎందుకు బబుల్ గం నములుతారు.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా

కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించిన మూడు మ్యాచ్లలో టీమిండియా రెండు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. అలాగే ఐపీఎల్ విషయానికి వస్తే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ 64 మ్యాచ్ లలో 31 మ్యాచ్ లలో విజయం సాధించి.. మరో 31 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఫార్మాట్ ఏదైనా సరే.. కే.ఎల్ రాహుల్ విజయాల శాతం 99% ఉండడం విశేషం.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×