Kohli – Rohit: భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాంచీలోని జె.ఎస్.సి.ఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. దీంతో పాకిస్తాన్ కి చెందిన షాహిద్ ఆఫ్రిది రికార్డును బద్దలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికా తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా సొంత గడ్డపై మొదటి టెస్ట్ లో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ కి దిగింది.
Also Read: Chew Gum: క్రికెటర్లు ఎందుకు బబుల్ గం నములుతారు.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా
అయితే ఓపెనర్ యశస్వి జైష్వాల్ {18} పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు తోడైన వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆరంభం నుండే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరూ అదరగొట్టడంతో పవర్ ప్లే లోని పది ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించింది. తద్వారా వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వన్డేలలో మొదటి 10 ఓవర్లలో మొదటిసారి ఈ మెర అత్యధిక స్కోరు లభించింది.
రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ వారి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్ బ్రేక్ సమయానికి.. 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు సాధించింది. అయితే సౌత్ ఆఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సుబ్రయాన్ బౌలింగ్ లో కౌ కార్నర్ మీదుగా రోహిత్ శర్మ భారీ స్లాగ్ – స్వీప్ తో తన 350 వ సిక్స్ కొట్టాడు. ఇక ఆ తర్వాత బంతికే అదే షాట్ ని పునరావృతం చేస్తూ షాహీద్ అఫ్రిది తో 351 సిక్సర్లతో సమానంగా నిలిచాడు. ఇక ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్ లో మరో సిక్స్ బాది వన్డేల్లో అత్యధిక సిక్సుల రికార్డుని బద్దలు కొట్టాడు. ఫైన్ లెగ్ మీదుగా బంతిని లాగి కొట్టడంతో షాహిద్ ఆఫ్రిది రికార్డుని అధిగమించాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ కేవలం 100 ఇన్నింగ్స్ లు ఆడి ఈ రికార్డుని అధిగమించడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో { అన్ని ఫార్మాట్ లలో కలిపి} 646 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అనంతరం రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులు చేసి.. మార్కో జాన్సెన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.
రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి బార్ట్ మాన్ బౌలింగ్ లో డెవాల్ట్ బ్రేవిస్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక గైక్వాడ్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. వచ్చి రాగానే పరుగు తీసేందుకు ప్రయత్నించి రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత 19 బంతుల్లో 13 పరుగులు చేసి బార్ట్ మాన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.
Also Read: Bodybuilder death: బాడీ బిల్డర్‌ని కొట్టి చంపేశారు..మహిళలను గెలికినందుకు ఏకంగా 20 మంది కర్రలతో
ఇక వాషింగ్టన్ సుందర్ తర్వాత కెప్టెన్ కే.ఎల్ రాహుల్ క్రీజ్ లోకి వచ్చాడు. అయితే ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన సెంచరీలో ఏకంగా 5 సిక్సులు, 6 ఫోర్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 102 బంతుల్లో 103 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియా 37.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అయితే విరాట్ కోహ్లీ వన్డే లో 52వ సెంచరీ పూర్తి చేసి సచిన్ ను వెనక్కి నెట్టాడు. వన్డేలలో ఇప్పటివరకు సచిన్ 51 సెంచరీలు చేయగా, కోహ్లీ 52 కు చేరుకున్నాడు.