E-Paper
Advertisement

Chew Gum: క్రికెటర్లు ఎందుకు బబుల్ గం నములుతారు.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా

Chew Gum: క్రికెటర్లు ఎందుకు బబుల్ గం నములుతారు.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా
Advertisement

Chew Gum: క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్.. ఇలా గేమ్ ఏదైనా కావచ్చు.. ఈ గేమ్స్ ఆడే ఆటగాళ్లు ఎక్కువగా బబుల్ గమ్ నములుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా క్రికెట్ లో కపిల్ దేవ్ నుండి సూర్య కుమార్ యాదవ్ వరకు చాలామంది క్రికెటర్లు మైదానంలో ఈ బబుల్ గమ్ ని నమలడం మనం టీవీల్లో చూస్తూనే ఉంటాం.

Also Read: Bodybuilder death: బాడీ బిల్డర్‌ని కొట్టి చంపేశారు..మ‌హిళ‌ల‌ను గెలికినందుకు ఏకంగా 20 మంది క‌ర్రల‌తో

Advertisement

అయితే ఆటగాళ్లు ఈ చూయింగ్ గమ్ ఎందుకు వాడతారు..? ఇది నమ్మడం వల్ల కలిగే లాభాలేంటి..? నష్టాలేంటి..? అంటే దీని వెనక ఓ ప్రత్యేక కారణమే ఉందని చెబుతున్నారు నిపుణులు. బబుల్ గమ్ నమిలిన వ్యక్తిలో చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతున్నారు.

 

చూయింగ్ గమ్ వల్ల కలిగే ప్రయోజనాలు:

Advertisement

పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ చూయింగ్ గమ్ నములుతుంటారు. అయితే చిన్నపిల్లలు ఇది తింటే పెద్దలు కోపగించుకుంటారు. ఎందుకంటే పొరపాటున దాన్ని మింగితే ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతుంటారు. అయితే ఈ చూయింగ్ గమ్ తో అనారోగ్యమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చూయింగ్ గమ్ నమలడం వల్ల డబుల్ చిన్ సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ హిప్పో కాంపస్ లో మెదడులోని భాగాన్ని సంక్రియం చేస్తుందట. అంటే జ్ఞాపకం శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే ఒత్తిడిని, చిరాకును తగ్గిస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. దంతాల పసుపు రంగును కూడా తొలగించగలదని, నోటిలో లాలాజలాన్ని, క్షయం, సున్నితత్వాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

 

అలసట నుంచి విముక్తి కోసమే:

బబుల్ గమ్ నమిలే ప్రాసెస్ లో.. సాధారణ సమయం కంటే మెదడుకు ఎక్కువ మొత్తంలో రక్త సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బబుల్ గమ్ తింటున్న వ్యక్తిలో మెదడుకు విశ్రాంతిని ఇచ్చే సెరోటోనిన్ కూడా విడుదలవుతుంది. అందువల్ల క్రికెటర్లు మైదానంలో ఉన్నప్పుడు అలసటను ఎదుర్కోగలుగుతారు. ఈ కారణాల వల్ల క్రీడాకారులు గేమ్స్ ఆడుతున్న సమయంలో బబుల్ గమ్ నమలడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా క్రికెటర్లు రిఫ్రెష్ గా ఉంటేనే వారు బాగా ఆడగలుగుతారు. అయితే చూయింగ్ గమ్ లో ఉండే గ్లూకోజ్ క్రీడాకారులను రిఫ్రెష్ చేస్తుంది.

Also Read: 𝐀𝐛𝐡𝐢𝐬𝐡𝐞𝐤 𝐒𝐡𝐚𝐫𝐦𝐚: 32 బంతుల్లో అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీ.. 28 సిక్స‌ర్లు, 20 ఓవర్లలో 310 రన్స్

దీంతో వాళ్లు శక్తిని కోల్పోకుండా మైదానంలో చాలాసేపు ఉండగలుగుతారు. ఇక దీనిని నమలడం వల్ల మెదడు అప్రమత్తంగా ఉంటుంది, నాడీ వ్యవస్థ మెదడు నుంచి శరీర భాగాలకు త్వరగా సందేశాలను పంపగలుగుతుంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అలర్ట్ గా ఉండడానికి ఈ బబుల్ గమ్ ని నములుతుంటారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే.. బబుల్ గమ్ నమలడం వల్ల నోట్లో నుంచి లాలాజలం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్లకు దాహం బాగా వేస్తుంది. ఈ క్రమంలో వీళ్ళు నీళ్లు తాగుతారు. నీళ్లు తాగకపోతే వీళ్ళ బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×