E-Paper
Advertisement

నెపో కిడ్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్.. ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు తెరలేపిన బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్

నెపో కిడ్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్.. ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు తెరలేపిన బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్
Advertisement

Imtiaz Ali: నెపోటిజం, అవుట్‌సైడర్స్ వర్సెస్ ఇన్‌సైడర్స్…ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అనే డిబేట్ ఎప్పటికీ ముగిసిపోని ఒక హాట్ టాపిక్. ఒకవైపు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు అవకాశాలు రావడం కష్టమని కొందరు వాదిస్తుంటే, మరోవైపు స్టార్ కిడ్స్‌గా ఎంట్రీ ఇవ్వడం వెనుక కూడా సాలిడ్ ప్రెజర్ ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. సరిగ్గా ఇదే విషయంపై బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ఇంతియాజ్ అలీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా ఇండస్ట్రీలో అవుట్‌సైడర్స్ పడే కష్టాల గురించే అందరూ మాట్లాడుకుంటారు, కానీ ఇంతియాజ్ అలీ మాత్రం ఇందుకు భిన్నంగా, అవుట్‌సైడర్స్ కంటే నెపో కిడ్స్ లేదా నెపో స్టార్లే ఎక్కువ కష్టపడతారంటూ చేసిన కామెంట్స్ బీ టౌన్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇంట్లో వాళ్లతోనే  సక్సెస్ తో పోటీ పడాలన్న ఇంతియాజ్ అలీ

Advertisement

ఇంతియాజ్ అలీ టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా ప్రపంచంలో సక్సెస్, దాని వెనుక ఉండే కష్టం గురించి విశ్లేషిస్తూ ఈ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా అలియా భట్, రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ యాక్టర్లను ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, ఇండస్ట్రీలో వారసత్వంతో అడుగుపెట్టే వాళ్లు అదనపు ఒత్తిడిని, కష్టాలను ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డాడు.

also read :నా లైబ్రరీలోనే నెంబర్ 1 సినిమా.. ‘పెద్ది’ విజయంపై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్!

Advertisement

ఒక అవుట్‌సైడర్‌కు ఇండస్ట్రీలోకి రావడం, గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే సవాల్ అయితే, ఒక స్టార్ కిడ్‌కు మాత్రం తమ ఇంట్లోనే సక్సెస్‌కు సజీవ సాక్ష్యాలు ఉంటాయని గుర్తుచేశాడు. వారు తమను తాము నిరూపించుకోవాలన్నా, కనీసం సక్సెస్ అయ్యామని చెప్పుకోవాలన్నామొదట తమ సొంత తండ్రులు, తాతలు, మామలు లేదా తల్లులు సాధించిన సక్సెస్ తో పోటీ పడాల్సి వస్తుందని ఇంతియాజ్ అలీ చెప్పుకొచ్చాడు.

నెపో స్టార్ల వైపు ఉన్న కష్టాన్ని సమర్దింపు 

నిజానికి ఇంతియాజ్ అలీ కూడా ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు. జమ్‌షెడ్‌పూర్ నుంచి ముంబై వచ్చి, టెలివిజన్ రంగంలో ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సంచలనాలు సృష్టించాడు. తాను ఒక అవుట్‌సైడర్ అయినప్పటికీ, నెపో స్టార్ల వైపు ఉన్న కష్టాన్ని ఈ రకంగా సమర్థించడం ఒకరకంగా ఆశ్చర్యమే.

also read :విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ ట్రైలర్ టాక్: ‘బిచ్చగాడు’ కాంబో మళ్లీ వచ్చేస్తోంది!

తనలాంటి బయటి వ్యక్తులకు ఇండస్ట్రీలో ఒక స్థాయికి రావడం కాస్త సులభంగానే ఉంటుందని, ఎందుకంటే తమపై ఎలాంటి అంచనాలు లేదా ఫ్యామిలీ లెగసీని కాపాడాలనే భారం ఉండదని ఆయన విశ్లేషించాడు. కానీ రణ్‌బీర్ కపూర్ లాంటి నటుడికి ప్రతి సినిమా కూడా వారి కుటుంబ ప్రతిష్టతో ముడిపడి ఉంటుందని, అందుకే వారు నిరంతరం తీవ్రమైన మెంటల్ ప్రెజర్ లో పనిచేయాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశాడు.

సినిమాల విషయానికి వస్తే..

ఇంతియాజ్ అలీ కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ విలక్షణమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో దిట్ట. 2005లో అభయ్ డియోల్, ఆయేషా టాకియాలతో రూపొందించిన సోచా నా థా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత 2007లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన జబ్ వీ మెట్ సాలిడ్ ఇండియన్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ కామెడీగా నిలిచింది

ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె నటించిన లవ్ ఆజ్ కల్ (2009), అలాగే స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన కాక్‌టైల్ (2012) సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు రణ్‌బీర్ కపూర్‌తో ఆయన చేసిన రాక్‌స్టార్ (2011), అలియా భట్‌తో తెరకెక్కించిన హైవే (2014) సినిమాలు వీరిద్దరి కెరీర్‌లోనే బెస్ట్ గా నిలిచిపోయాయి.. బహుశా ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వారి అంకితభావాన్ని, కష్టాన్ని ఇంతియాజ్ అలీ చాలా దగ్గరగా గమనించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేసిన బోల్డ్ స్టేట్‌మెంట్ మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది.చూడాలి వీటికి కౌంటర్ గా ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయో !

also read :‘పెద్ది’ తర్వాత మెగా పవర్ స్టార్‌కు సర్జరీ.. సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×