E-Paper
Advertisement

ఐపీఎల్ 2026లో నేను ఒక్క మ్యాచ్ చూడ‌లేదు, ఆ టోర్న‌మెంట్ అంటేనే విర‌క్తి పుడుతోంది!

ఐపీఎల్ 2026లో నేను ఒక్క మ్యాచ్ చూడ‌లేదు, ఆ టోర్న‌మెంట్ అంటేనే విర‌క్తి పుడుతోంది!
Advertisement

Litton Das: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మొన్న మే 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపిఎల్ 2026 ఫైనల్ జరిగింది. దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఈ మెగా టోర్నమెంట్ లో బెంగళూరు ఫైనల్ గా ట్రోఫీ దక్కించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నమెంటుకు అత్యధిక వ్యూయర్షిప్ వచ్చింది. అలాంటి ఐపీఎల్ ను కించపరిచేలా బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు లిటన్ దాస్ ( Litton Das) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026లో తాను ఒక్క మ్యాచ్ కూడా చూడలేదని బాంబు పేల్చారు. ఆ టోర్నమెంట్ అంటేనే విరక్తి పుడుతోందని.. అందుకే తన క్రికెట్ పైన దృష్టి సారించానని వెల్లడించారు. దీంతో బంగ్లా క్రికెటర్ లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం పెట్టుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

ఐపీఎల్ 2026లో నేను ఒక్క మ్యాచ్ చూడ‌లేదు – లిటన్ దాస్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అత్యధిక వ్యూయర్షిప్ అందుకొని.. చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి టోర్నమెంట్ ను కించపరిచేలా మాట్లాడారు బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు లిటన్ దాస్. ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో తాను ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా చూడలేదని బాంబు పేల్చారు. నిజానికి ఈ మధ్యకాలంలో ఐపీఎల్ చూడడమే మానేశానని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చూడాలని ఆసక్తి అస్సలు రావడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ టోర్నమెంట్ చూసే బదులు తన క్రికెట్ పైన దృష్టి సారిస్తున్నానని.. సమయం వృధా చేయడం లేదని వెల్లడించారు.

ఐపీఎల్ 2026 కొనసాగినన్ని రోజులు.. తాను మ్యాచ్లు చూడకుండా, తన అంతర్జాతీయ క్రికెట్ పైన ఫోకస్ చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. బంగ్లాదేశ్ బేవర్స్ గాళ్ళకు… బంగారం లాంటి ఐపిఎల్ వ్యాల్యూ ఏం తెలుసని నిలదీశారు. ఐపీఎల్ ఆడకుండా చేశామన్న కక్షతో.. లిటెన్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశాడని సీరియస్ అవుతున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడకుండా చేయాలని… పర్మనెంట్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఐపీఎల్ లో కేకేఆర్ త‌ర‌ఫున ఆడిన లిట‌న్ దాస్‌

Advertisement

ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో ఎదిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్… ఇప్పుడు మేకై గుర్తున్నాడు. ఐపీఎల్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడు. 2023 సమయంలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా 50 లక్షల రూపాయలకు లిటన్ దాస్ ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే ఆడాడు లిటన్ దాస్. అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ కక్షతో ఐపీఎల్ పై లిటన్ దాస్ ఈ కామెంట్లు చేసినట్లు చెబుతున్నారు.

 

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

Related News

కోహ్లీ చెత్త ఫీల్డర్‌.. అత‌ని చేత‌కాని త‌నం వ‌ల్లే..బ్రెండన్ మెక్‌కలమ్ 300 బాదేశాడు!

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

Big Stories

Advertisement
×