North Goa vs South Goa: వెకేషన్ అనగానే మన దేశంలో.. అందరికీ గుర్తొచ్చే మొదటి ప్లేస్ ‘గోవా’. అయితే గోవా ట్రిప్ ప్లాన్ చేసే.. ప్రతి ఒక్కరినీ వేధించే ఒకే ఒక్క ప్రశ్న. “నోర్త్ గోవా వెళ్ళాలా? సౌత్ గోవా వెళ్ళాలా? అని. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలు ఒకే రాష్ట్రంలో ఉన్నా.. వీటి వైబ్స్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఎప్పుడూ టాప్‌లో ఉండే ఈ ‘గోవా వార్’లో.. మీ మూడ్‌కి, మీ బడ్జెట్‌కి ఏది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో క్లియర్ కట్‌గా చూసేద్దాం.
క్రేజీ ఎనర్జీ.. అన్‌లిమిటెడ్ పార్టీలు:
మీరు గనుక ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వెళ్తూ.. ఫుల్ జోష్, మ్యూజిక్, నైట్‌లైఫ్ కోరుకుంటే మీకు నోర్త్ గోవా ఒక పారడైజ్. ఇక్కడి బాఘా , కలంగుట్, అంజునా బీచులు ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి.
నైట్‌లైఫ్ & క్లబ్స్: గోవా అనగానే గుర్తొచ్చే టిటోస్ లేన్, క్లబ్ కబానా లాంటి క్రేజీ పార్టీ స్పాట్స్ అన్నీ నోర్త్‌లోనే ఉన్నాయి. నైట్ అంతా డాన్స్ చేసి ఎంజాయ్ చేయాలనుకునే యూత్‌కి ఇది అల్టిమేట్ ఛాయిస్.
వాటర్ స్పోర్ట్స్: పారాసైలింగ్, జెట్ స్కీ, బనానా రైడ్స్ లాంటి అడ్వెంచర్స్ ఇక్కడ ఫుల్ ఫేమస్.
బడ్జెట్ ఫ్రెండ్లీ: తక్కువ ధరలో దొరికే హాస్టల్స్, హోమ్‌స్టేలు, స్ట్రీట్ షాపింగ్ (అంజునా ఫ్లీ మార్కెట్) ఇక్కడ చాలా ఎక్కువ.
సౌత్ గోవా:
నోర్త్ గోవా అంతా హడావిడిగా ఉంటే.. దానికి కంప్లీట్ ఆపోజిట్ సౌత్ గోవా. మీరు రొటీన్ లైఫ్ నుండి తప్పించుకుని.. పీస్ ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కళ్ళు మూసుకుని సౌత్ గోవా వెళ్ళిపోవచ్చు.
ప్రిస్టైన్ బీచెస్: ఇక్కడి పాలోలెం, అగోండా, బటర్‌ఫ్లై బీచులు చాలా క్లీన్‌గా, ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ రద్దీ చాలా తక్కువ.
రొమాంటిక్ & ఫ్యామిలీ వైబ్: హనీమూన్ కపుల్స్‌కి, ప్రశాంతతను కోరుకునే ఫ్యామిలీలకి సౌత్ గోవా బెస్ట్. ఇక్కడి లగ్జరీ రిసార్ట్స్, ప్రైవేట్ బీచులు మైండ్ రిఫ్రెష్ చేస్తాయి.
నేచర్ అండ్ హెరిటేజ్: దూద్‌సాగర్ జలపాతాలు, పాతకాలపు పోర్చుగీస్ చర్చిలు, వైల్డ్‌లైఫ్ శాంచ్యురీలు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్.
వైబ్ , వాతావరణం:
నోర్త్ గోవా , సౌత్ గోవాల మధ్య వాతావరణంలో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. నోర్త్ గోవా ఎప్పుడూ ఫుల్ క్రౌడ్, లాడ్ మ్యూజిక్, ఎనర్జిటిక్ వైబ్స్‌తో సందడిగా ఉంటుంది. పార్టీ మూడ్‌లో ఉండే యువతకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్. దీనికి పూర్తి భిన్నంగా సౌత్ గోవా చాలా సైలెంట్, పీస్ ఫుల్ , క్లాస్ లుక్‌తో కనిపిస్తుంది. రొటీన్ లైఫ్ ఒత్తిడి నుంచి దూరంగా.. ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్ అవ్వాలనుకునే వారికి సౌత్ గోవా ఒక అద్భుతమైన ఆప్షన్.
బీచెస్ , అందాలు:
నోర్త్ గోవాలో ఉన్న బాఘా, కలంగుట్, కాండోలిమ్ వంటి బీచులు పర్యాటకులతో ఎప్పుడూ కళకళలాడుతుంటాయి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ హడావిడి, షాపింగ్ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అదే మీరు సౌత్ గోవా వైపు వెళ్తే.. పాలోలెం, అగోండా, కోల్వా వంటి బీచులు కనిపిస్తాయి. ఇవి చాలా క్లీన్‌గా, ప్రశాంతంగా ఉండి ప్రకృతిని ఆస్వాదించడానికి అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి బీచ్‌లలో జనం రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.
నైట్‌లైఫ్ , ఎంటర్‌టైన్‌మెంట్ :
నైట్‌లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే.. వారికి నోర్త్ గోవా కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇక్కడ రాత్రి వేళల్లో పార్టీలు చేసుకోవడానికి టాప్ క్లాస్ పబ్‌లు, నైట్ క్లబ్‌లు , లగ్జరీ క్యాసినోలు అందుబాటులో ఉంటాయి. నైట్ అంతా డాన్స్ చేస్తూ గడపడానికి ఇది బెస్ట్. కాగా..సౌత్ గోవాలో నైట్‌లైఫ్ చాలా క్లాసిక్‌గా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద సౌండ్స్ ఉండే క్లబ్స్ కంటే.. ప్రశాంతమైన బీచ్ సైడ్ క్యాండిల్ లైట్ డిన్నర్స్, హాయిగా సాగిపోయే లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
Also Read: అచ్చం అద్దం లాగే.. ఇండియాలోని ఈ సరస్సులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ!
బడ్జెట్ :
ఖర్చుల విషయానికి వస్తే.. నోర్త్ గోవా చాలా వరకు పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ తక్కువ ధరలోనే బడ్జెట్ హోటళ్లు, హోమ్‌స్టేలు, కేఫ్‌లు, స్ట్రీట్ ఫుడ్ సులభంగా దొరుకుతాయి. అందుకే బ్యాక్‌ప్యాకర్స్ ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. మరోవైపు.. సౌత్ గోవా కాస్త కాస్ట్‌లీ అని చెప్పాలి. ఇక్కడ ఎక్కువగా స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్ ,ప్రైవేట్ విల్లాలు ఉంటాయి. కాస్త ఎక్కువ బడ్జెట్ కేటాయించి.. విలాసవంతమైన లగ్జరీ స్టేస్ కోరుకునే వారికి సౌత్ గోవా పర్ఫెక్ట్ ఛాయిస్.
మీ నెక్స్ట్ వెకేషన్‌కి ఏది బెటర్?
చివరిగా చెప్పేది ఏంటంటే.. మీ ట్రిప్ మోటో ఏంటనేదే ఇక్కడ ముఖ్యం. ఫ్రెండ్స్‌తో కలిసి నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే నోర్త్ గోవా వైపు వెళ్ళండి. అలా కాకుండా.. పార్ట్‌నర్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి. ప్రకృతిని ఆస్వాదిస్తూ లగ్జరీగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే.. సౌత్ గోవాని సెలెక్ట్ చేసుకోండి. హ్యాపీ జర్నీ.