Adam Gilchrist: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final, ) మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ జరిగింది. అయితే ఈ సందర్భంగా 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా టైటిల్ గెలుచుకుంది. దీంతో ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకున్న జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా మూడోసారి టైటిల్ గెలవడంపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ( Adam Gilchrist) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా గెలవాల్సిన టైటిల్స్ అన్నీ కూడా ఇండియా గెలుస్తోందని పేర్కొన్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా నిలిచిన టీమిండియా పై గిల్ క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ ను దైవంగా టీమిండియా ప్లేయర్లు భావిస్తారు.. గుండెల్లో పెట్టుకుంటారు.. వరల్డ్ కప్ గెలవడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారని ఇండియన్ ప్లేయర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు గిల్ క్రిస్ట్. మిగతా ప్లేయర్లు అలా వరల్డ్ కప్ ను ట్రీట్ చేయబోరని.. మండిపడ్డారు. 2023 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు చూపించిన బలుపును కూడా గుర్తు చేశారు.
2023 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టైటిల్ పైన మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. కంగారు ప్లేయర్లకు ఉన్నంత బలుపు ఎవరికీ ఉండదని గిల్ క్రిస్ట్ సీరియస్ అయ్యారు. అలా టైటిల్ పైన కాళ్లు పెట్టిన నుంచి ఇప్పటివరకు ఆస్ట్రేలియా అన్ని ట్రోఫీలు ఓడిపోతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్ లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియా ఎలిమినేట్ కావడం దీనికి సంకేతం అన్నారు. ఆ పాపం ఆస్ట్రేలియాను వెంటాడి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా టీం ఇండియా ప్లేయర్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఆస్ట్రేలియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు గిల్ క్రిస్ట్.
ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు ఆస్ట్రేలియా.. అలాంటి ఆస్ట్రేలియాను దిగజారేలా ప్రస్తుత ప్లేయర్లు తయారయ్యారని మండిపడ్డారు. అలాగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament ) ఇండియాకు ( Team India) పోటీ ఇవ్వగల ఏకైక జట్టు ఆస్ట్రేలియా అని గుర్తు చేశారు. కానీ 2023 వరల్డ్ కప్ ( 2023 World Cup ) శాపం ఆస్ట్రేలియాను ( Australia) వేధిస్తోందని గిల్ క్రిస్ట్ వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్లేయర్ల కంటే సూర్యకుమార్ యాదవ్ ( Surya kumar yadav) ట్రోఫీని బాగా గౌరవిస్తాడని… అందుకే ఇప్పుడు సక్సెస్ అయ్యాడని పేర్కొన్నారు.
🚨 MASSIVE STATEMENT BY ADAM GILCHRIST ON TEAM INDIA RESPECT WC TROPHY 🚨
Adam Gilchrist Said 🗣️
"Australia was the only team that could give competition to the Indian team in this tournament, but last time they made a mockery of the trophy, due to which this time the trophy… pic.twitter.com/eRDEdgADLL
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 12, 2026