E-Paper
Advertisement

T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !
Advertisement

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకుంది. అయితే టీమిండియా టైటిల్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ మధ్య గొడవలు బయటపడ్డాయి. టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

గౌతమ్ గంభీర్ వర్సెస్ అజిత్ అగార్కర్ గొడవలు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ( GAUTAM GAMBHIR ) అలాగే సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ ( AJIT AGARKAR) మధ్య గొడవలు ఉన్నట్లు జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం వన్డే కెప్టెన్ గిల్ ను తీసుకోవాల్సిందేనని గౌతమ్ గంభీర్ మొండిపట్టు పట్టినట్లు తెలుస్తోంది. అప్పటికే గిల్ ప్రదర్శన ఏమాత్రం లేదు. వన్డేలో కూడా టెస్ట్ ప్లేయర్ లాగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు గిల్. దీనికి తోడు మెడనొప్పి, ఇతర గాయాల కారణంగా పదేపదే జట్టుకు కూడా దూరమయ్యాడు గిల్. అలాంటి వాడిని టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే టీమిండియా జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ తన తరుపున వాదన వినిపించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే గౌతమ్ గంభీర్ చేసిన ఈ డిమాండ్ నేపథ్యంలో టీమిండియా సెలక్షన్ హెడ్ అజిత్ అగార్కర్ మాత్రం ససే మీరా అన్నట్లు తెలుస్తోంది.

గిల్ అసలు ఫామ్ లో లేదు, అలాంటి వాడిని జట్టులో తీసుకుంటే మన పరువు పోతుంది.. క్రికెట్ అభిమానులు కూడా బీసీసీఐతో పాటు నన్ను తిడతారని గౌతమ్ గంభీర్ ముందే అజిత్ అగార్కర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్, రింకూ సింగ్ పేరును ప్రతిపాదించి, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం ఆ ఇద్దరిని ఫైనల్ చేశాడు అజిత్ అగార్కర్. అయితే అజిత్ అగార్కర్ తీసుకున్న నిర్ణయం పై గంభీర్ ఇప్పటికీ గరంగరంగానే ఉంటున్నాడట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అజిత్ అగార్కర్ తీసుకువచ్చిన ఇషాన్ కిషన్ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రానించి.. సక్సెస్ అయ్యాడు. దీంతో అజిత్ అగార్కర్ ను క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు. గంభీర్ మాట విని గిల్ ను సెలెక్ట్ చేసి ఉంటే టీమిండియా కొంప మునిగేది అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత అజిత్ అగార్క‌ర్ మంచి ప‌ని చేశాడ‌ని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్‌.

Advertisement

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×