E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు
Advertisement

Michael Vaughan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Suryavanshi) అందరి కన్ను పడింది. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినందుకు గాను ఇంగ్లాండ్, ఐర్లాండ్ తో పాటు ఏషియన్ గేమ్స్ కోసం వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) సెలెక్ట్ చేసింది. అయితే ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీకి అవకాశం రాలేదు. ఇంగ్లాండ్ తో మిగిలిన నాలుగు మ్యాచ్ లలో అయినా వైభవ్ కు అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు. అయితే వైభవ్ అరంగేట్రంపై ఇంగ్లాండు క్రికెటర్లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ (Michael Vaughan) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ ఆట చూసేందుకు, ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వైభ‌వ్ పై మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని తీసుకోవాలని చాలామంది డిమాండ్లు వినిపిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ హీరోలకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలన్న లక్ష్యంతో గంభీర్ ముందుకు సాగుతున్నారు. సంజు శాంసన్ , తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఇలా చాలామంది టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించి, టైటిల్ అందించారు. అయితే అలాంటి వాళ్ళను పక్కకు పెట్టి 15 ఏళ్ల బుడ్డోడికి ఛాన్స్ ఇవ్వలేమని హింట్ ఇస్తున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీని తీసుకోకపోవడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ తప్పుబట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో వైభవ్ అద్భుతం చేశాడని గుర్తు చేశారు.

అలాంటి ఆటగాడి.. ప్రదర్శన చూసేందుకు ఇంగ్లాండ్ మొత్తం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. తాను కూడా వైభవ్ కోసం ఎక్కడి నుంచో కారు డ్రైవింగ్ చేసి మరి ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ ల కోసం వస్తున్నానని వివరించారు. కానీ వైభవ్ ను మాత్రం ఆడించడం లేదని ఫైర్ అయ్యారు. చాలా మంది ఇంగ్లీష్ క్రికెట్ అభిమానులు… టికెట్లు కొని వైభవ్ ఆట కోసం ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తమ ఇంగ్లాండే కాకుండా ప్రపంచం మొత్తం వైభవ్ ఆట కోసం ఎదురుచూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్న గంభీర్ లో మాత్రం చలనం రావడం లేదని ఆగ్రహించారు. ఇంకెన్ని రోజులు వైభవ్ సూర్యవంశీని దాస్తారు అంటూ నిలదీశారు. ఇప్పటికైనా అతడికి అవకాశాలు ఇవ్వాలని కోరారు. దీంతో మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

Related News

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తో వెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Furqan: పాకిస్తాన్ కంటే ఐర్లాండ్ బెట‌ర్‌..టీమిండియాను నేల నాకించేసింది

Nida Dar: నన్ను చూస్తేనే టీమిండియా భ‌య‌ప‌డిపోయేది..రాత్రుళ్లు ఉలిక్కిప‌డేవారు

టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

Big Stories

×