E-Paper
Advertisement

టీవీలు, లాప్‌టాప్‌లపై 80% వరకు తగ్గింపు.. రోజుకు రూ.99కే హోమ్ అప్లయెన్సెస్!

టీవీలు, లాప్‌టాప్‌లపై 80% వరకు తగ్గింపు.. రోజుకు రూ.99కే హోమ్ అప్లయెన్సెస్!
Advertisement

Amazon Prime Day 2026: భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మొదలై అప్పుడే పదేళ్లు పూర్తయింది. ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్లతో మన ముందుకు వస్తోంది. జూలై 4 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్.. జులై 6 రాత్రి 11:59 గంటల వరకు.. అంటే పూర్తి 72 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ సభ్యుల కోసం కొన్ని ముందస్తు ఆఫర్లు ఇప్పటికే లైవ్ లోకి వచ్చేశాయి. ఈ పండుగ సీజన్ సేల్‌లో ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.

సగం ధరకే ప్రైమ్ మెంబర్‌షిప్:

ఈసారి 10వ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా సరికొత్త యూజర్ల కోసం అమెజాన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సాధారణంగా రూ.1,499 ఉండే వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్ ధరను ఏకంగా రూ.999కి తగ్గించింది. అంటే నేరుగా రూ.500 ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పూర్తి ప్యాకేజీ వద్దు అనుకుంటే, తక్కువ ధరలో లభించే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ లేదా ప్రైమ్ లైట్ ప్లాన్లను కూడా ఎంచుకోవచ్చు. దీనికి తోడు ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడే వారికి అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: Samsung నుంచి సరికొత్త AI స్మార్ట్ గ్లాసెస్.. ఎలా పనిచేస్తాయో లీక్ చేసిన కంపానియన్ యాప్!

స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు:

ఈ సేల్‌లో మొబైల్ ప్రియుల కోసం భారీ డిస్కౌంట్లతో పాటు కొత్త లాంచ్‌లు కూడా ఉన్నాయి. అందరినీ ఆకర్షిస్తున్న శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా 5G ఫోన్ రూ.84,999కే లభించనుంది. అలాగే వన్‌ప్లస్ 13 ఫోన్ రూ.49,999కి అందుబాటులో ఉంటుంది. ఇక బడ్జెట్ ధరలో కొత్తగా వస్తున్న శాంసంగ్ గెలాక్సీ M47 5G రూ.22,999కి, వన్‌ప్లస్ N6, ఐకూ Z11x 5G ఫోన్లు రూ.19,999ల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వస్తున్నాయి. పాత ఫోన్లపై రూ.66,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

లాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్:

Advertisement

టెక్ లవర్స్ కోసం అసిస్ వివోబుక్ 16, హెచ్‌పీ విక్టస్ గేమింగ్ లాప్‌టాప్‌లతో పాటు షియోమి ప్యాడ్ 8 పై మంచి డీల్స్ ఉన్నాయి. ఇక ఇళ్లలో వాడే స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లపై కూడా భారీగా ధరలు తగ్గాయి. శాంసంగ్ విజన్ ఏఐ స్మార్ట్ మినీ టీవీ, సోనీ బ్రావియా 3 సిరీస్ వంటి పాపులర్ మోడల్స్ ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కొన్ని హోమ్ అప్లయెన్సెస్ అయితే రోజుకు కేవలం రూ.99 ఈఎంఐ చెల్లించేలా సులభమైన ఆప్షన్లను తీసుకొచ్చారు.

ఏఐ టూల్స్‌తో స్మార్ట్ షాపింగ్:

ఈ ఏడాది అమెజాన్ తమ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రూఫస్, లెన్స్ ఏఐ, ఏఐ రివ్యూ హైలైట్స్ వంటి సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను పరిచయం చేసింది. ఇవి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఫీచర్లను సులువుగా పోల్చి చూసుకోవడానికి, కస్టమర్ల రివ్యూలను వేగంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మొత్తానికి ఈ 72 గంటల అమెజాన్ ప్రైమ్ డే సేల్, కొత్త గ్యాడ్జెట్లు కొనాలనుకునే వారికి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

Also Read: ఇక DSLR పని ఖతం.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో వస్తోన్న వివో కొత్త ఫోన్!

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×