Tanveer Ahmed: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న టీ20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో నిన్న మొట్ట మొదటి మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 189 పరుగులు సాధించింది. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం భారీగా కురిసింది. చాలాసేపు చూసినా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో టీమిండియా కష్టపడి చేసిన పరుగులన్నీ వృథా అయ్యాయి. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 రద్దయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వర్షం పడిన నేపథ్యంలో టీమిండియా బతికి బయటపడిందని హేళన చేశారు. నిన్న వర్షం పడి ఉండకపోతే, ఇంగ్లాండ్ చేతిలో మరో ఓటమిని టీమిండియా చవిచూసేదంటూ వ్యాఖ్యానించారు. వర్షం పడడం వల్ల ఓటమిని టీమిండియా తప్పించుకుందని ఎద్దేవా చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టి20 మ్యాచ్ నిన్న రద్దయిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. కానీ 190 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండు బ్యాటింగ్ కు దిగకు ముందే వర్షం పడింది. వర్షం ఏమాత్రం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. టీమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 రద్దయిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వర్షం పడడం వల్ల టీమిండియా ఓటమిని తప్పించుకుందని ఎద్దేవా చేశారు. వర్షం పడకుండా ఉంటే ఇంగ్లాండ్ కచ్చితంగా విజయం సాధించేదని.. పేర్కొన్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు సందర్భంగా టీమిండియా భారీ స్కోర్ చేసినప్పటికీ.. దాన్ని చేదించే దిశగా అడుగులు వేసిందని ఇంగ్లాండును ప్రశంసించారు. చివరి క్షణంలో ఇంగ్లాండ్ ఓడిపోయింది తప్ప… ఆ మ్యాచ్ లోనూ టీమిండియాకు పరాభవం ఎదురయ్యేదన్నారు. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయినట్లుగానే ఈ సిరీస్ లో కూడా టీమిండియా వైట్ వాష్ కాక తప్పదని హెచ్చరించారు. ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ కాకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. అవసరమైతే బట్టలు లేకుండా లాహోర్ వీధుల్లో తిరుగుతానని శపథం చేశారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు అయిన నేపథ్యంలో హాట్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ మైదానాలలో తప్ప టీమిండియా ప్లేయర్లు విదేశాలలో ఆడలేరని పరువు తీశారు. ఫ్లాట్ మైదానాలలో 280 నుంచి 300 వరకు పరుగులు చేయడం వాళ్లకు సులభమని ఎద్దేవా చేశారు. విదేశీ మైదానాలకు వస్తే 150 కూడా దాటలేరని హేళన చేశారు. ఫ్లాట్ మైదానాలలో ఆడడానికి అలవాటైన టీమ్ ఇండియా ప్లేయర్లు, ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ కావడం గ్యారెంటీ అన్నారు. దీంతో తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.