E-Paper
Advertisement

Michael Vaughan: ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను చూసి బుద్ది తెచ్చుకో…హెడ్ కు కోహ్లీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే !

Michael Vaughan: ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను చూసి బుద్ది తెచ్చుకో…హెడ్ కు కోహ్లీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే !
Advertisement

Michael Vaughan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా విరాట్ కోహ్లీ అలాగే ట్రావిస్ హెడ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేస్తుండగా, ఇద్దరు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక మ్యాచ్ ఫినిష్ అయిన అనంతరం, ట్రావిస్ హెడ్ ను (Travis Head) అవమానిస్తూ షేక్ హ్యాండ్ ( shaking hands) ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై విరాట్ కోహ్లీని దోషిగా చేస్తూ చాలామంది సీరియస్ అవుతున్నారు. హెడ్ విషయంలో కోహ్లీ తప్పు చేశాడని మండిపడుతున్నారు. ఒక వరల్డ్ క్లాస్ ఆటగాడు ఇలా వ్యవహరించడం చాలా తప్పిదమని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు మైఖేల్ వాన్ (Michael Vaughan) కూడా స్పందించారు. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ లను చూసి విరాట్ కోహ్లీ బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటించారు. హెడ్ విషయంలో విరాట్ కోహ్లీ ది 100కు 200 శాతం తప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు మైఖేల్ వాన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను చూసి బుద్ది తెచ్చుకో…కోహ్లీపై వాన్ సీరియ‌స్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య కీలక మ్యాచ్ జరగగా, విరాట్ కోహ్లీ వర్సెస్ హెడ్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం నెలకొంది. ఈ సంఘటనను క్షుణ్ణంగా పరిశీలించిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ సీరియస్ అయ్యారు. విరాట్ కోహ్లీని దోషిగా చేస్తూ మండిపడ్డారు. క్రికెట్ మ్యాచ్ అంటే కచ్చితంగా ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతాయి.. కానీ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. అయితే, హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చినప్పటికీ, విరాట్ కోహ్లీ బలుపు చూపించాడని మండిపడ్డారు.

వరల్డ్ క్లాస్ ఆటగాడిగా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఇలా వ్యవహరించడం ఏమాత్రం కరెక్ట్ కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు మైఖేల్ వాన్. విదేశీ ప్లేయర్లను అవమానించే తరహాలో కోహ్లీ తీరు ఉందని సీరియస్ అయ్యారు. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇండియన్ ప్లేయర్లను కూడా అలాగే అవమానిస్తారని వార్నింగ్ ఇచ్చారు. మహేంద్ర సింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా ప్రత్యర్ధులను గౌరవిస్తారని కొనియాడారు. అందుకే వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందని.. కానీ విరాట్ కోహ్లీ అగ్రెసివ్ తీరు వల్ల అందరికీ విలన్ గా మారుతున్నాడని మండిపడ్డారు. ధోని అలాగే రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటించారు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×