E-Paper
Advertisement

Mohammad Amir: నీ కంటే ఉగాండా ప్లేయ‌ర్లు న‌యం..కండ్లు మూసుకుని ఆడే ద‌ద్ద‌మ్మ‌, అభిషేక్ ప‌రువు తీసిన అమీర్‌

Mohammad Amir: నీ కంటే ఉగాండా ప్లేయ‌ర్లు న‌యం..కండ్లు మూసుకుని ఆడే ద‌ద్ద‌మ్మ‌, అభిషేక్ ప‌రువు తీసిన అమీర్‌
Advertisement

Mohammad Amir:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో అభిషేక్ శర్మ ( ABHISHEK SHARMA) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మూడుసార్లు డక్ అవుట్ అయిన అభిషేక్ శర్మ దక్షిణాఫ్రికా పై కేవలం 15 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మను ఉద్దేశించి, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్. కండ్లు మూసి బ్యాటింగ్ చేయడం కాదు.. బంతిని చూసి కొట్టు.. అంటూ మహమ్మద్ అమీర్ ( MOHAMMAD AMIR) చురకలు అంటించారు. ముందు నుంచి నేను చెబుతున్నాను… అభిషేక్ కండ్లు మూసుకొని మాత్రమే బ్యాటింగ్ చేస్తాడు.. అందుకే విఫలమవుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు మహమ్మద్ అమీర్.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

కండ్లు మూసుకుని ఆడే ద‌ద్ద‌మ్మ‌, అభిషేక్ ప‌రువు తీసిన అమీర్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. టి20 వరల్డ్ కప్ కంటే ముందు అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ.. టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత విఫలమవుతున్నాడు. గ్రూప్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లలో డక్ ఔట్ అయ్యాడు. ఇక సూపర్ 8 లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా కూడా అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోవాల్సిన అభిషేక్ శర్మ, ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో 15 పరుగులకు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మ ప్రదర్శన పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ కూడా స్పందించాడు. టి20 నెంబర్ వన్ ఆటగాడు అయిన అభిషేక్ శర్మ చెత్త బ్యాటర్ గా మారిపోయాడని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు కచ్చితంగా బ్యాటర్ కు టెక్నిక్ ఉండాలి.. కానీ ఆ టెక్నిక్ అభిషేక్ శర్మకు లేదని చురకలు అంటించారు. అసలు అతడికి బ్యాటింగ్ చేసే ఓపిక లేదని నిప్పులు చెరిగారు. అసలు బంతి ఎక్కడ పడుతోంది? ఎక్కడికి వస్తోంది ? అని చూడకుండా.. కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మహమ్మద్ అమీర్. అభిషేక్ శర్మ కంటే ఉగాండా ప్లేయర్లు అద్భుతంగా ఆడతారని సెటైర్లు పేల్చాడు. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా t20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 నేపథ్యంలో టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేటతో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. దీంతో సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుని ఇండియా.

Advertisement

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×