E-Paper
Advertisement

Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !
Advertisement

Nasser Hussain:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా సూపర్ 8 మ్యాచులు నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు చేశారు. దీంతో చిరు పాయింట్ రెండు జట్లకు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్ రద్దు అయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ ( Nasser Hussain) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసిన‌ట్లు ఇంగ్లాండ్ మాజీ ప్లేయ‌ర్ నాజ‌ర్ హుస్సేన్ బాంబ్ పేల్చారు. అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు పెట్టార‌ని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) సూపర్ 8 నేపథ్యంలో 8 మ్యాచ్ ల‌ను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూపు 1లో టీమిండియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే అలాగే వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఇక ఈ గ్రూప్ వన్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ కూడా ఇండియాలోనే జరగనున్నాయి. గ్రూపు 2 లో పాకిస్తాన్ ( PAkistan), న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక జట్లు ఉంటాయి. వీటికి సంబంధించిన మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. శ్రీలంకలో నెల రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదే జరిగితే గ్రూప్ 2 లో భాగంగా జరిగే సూపర్ 8 మ్యాచ్ లు అన్నీ కూడా రద్దు అవుతాయని అంటున్నారు. అలా జరిగితే నాలుగు జట్లకు సమానంగా పాయింట్లు దక్కుతాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్ అలాగే ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్ కు చేరతాయి. అప్పుడు పాకిస్తాన్ ఎలిమినేట్ అయి, ఇంటి దారి పట్టాల్సిందే. అయితే ఇదే అంశంపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ ( Nazar Hussain) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను ఇంటికి పంపించేందుకు ఇలా వర్షాలు ఉండే వేదికలను ఐసీసీ రూపొందించింది అని… బీసీసీఐ చెబితేనే ఇదంతా డ్రామా నడిచిందని నాజర్ హుస్సేన్ ఆరోపణలు చేశారు. ఇలా బీసీసీఐ అన్నిటిలో వేలు పెట్టి క్రికెట్ ను నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా ఇవాళ సూపర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అద్దంకిగా మారే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దు కానుంది.

Advertisement

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×