E-Paper
Advertisement

Mohammad Amir: అభిషేక్ శర్మకు క్షమాపణలు చెప్పిన పాకిస్తాన్ బౌలర్‌..నీ కంటే మొన‌గాడు ఎవ‌డు లేడు అంటూ

Mohammad Amir: అభిషేక్ శర్మకు క్షమాపణలు చెప్పిన పాకిస్తాన్ బౌలర్‌..నీ కంటే మొన‌గాడు ఎవ‌డు లేడు అంటూ
Advertisement

Mohammad Amir : టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మకు (Abhishek Sharma) క్షమాపణలు చెప్పాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ). నిన్ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెంపలు వేసుకున్నాడు. జింబాబ్వే పైన అభిషేక్ శర్మ అర్థ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే తప్పు తెలుసుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ దిగివచ్చాడు. అభిషేక్ శర్మను తిట్టినందుకు.. అతని బ్యాటింగ్ ప్రదర్శనను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

అభిషేక్ శర్మకు క్షమాపణలు చెప్పిన పాకిస్తాన్ క్రికెటర్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. వరుసగా మూడు సార్లు డక్ అవుట్ అయ్యాడు అభిషేక్ శ‌ర్మ‌. దక్షిణాఫ్రికా పై కేవలం 15 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో అభిషేక్ శర్మ కెరీర్ క్లోజ్ అయిందని.. అతడు పనికిరాడు అని చాలా మంది విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే అభిషేక్ శర్మ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ కూడా స్పందించారు. అభిషేక్ శర్మ అసలు పెద్ద ఆటగాడు కాదని.. కండ్లు మూసుకొని బ్యాటింగ్ చేస్తాడని విమర్శలు చేశారు. అందులో కొన్ని బంతులు తగిలితే అదృష్టం కొద్ది సిక్సర్లు వెళ్లాయని.. అంతేకానీ అతడు పెద్ద బ్యాటర్ కాదని సెటార్లు పేల్చాడు మహమ్మద్ అమీర్. అదృష్టం కొద్దీ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు తప్ప అతనికి క్రికెట్ ఆడరాదని విమర్శలు చేశాడు.

అయితే గురువారం జింబాబ్వే పైన టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ అర్థసించరి నమోదు చేశాడు. భయంకరంగా మరోసారి బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ. గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా.. వికెట్ల లోపలి వైపుకు వచ్చి బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ. దీంతో అర్థ సెంచరీ నమోదు చేయగలిగాడు. అయితే జింబాబ్వే అద్భుతంగా అభిషేక్ శర్మ ఆడిన నేపథ్యంలో మహమ్మద్ అమీర్ తన తప్పు తెలుసుకున్నాడు. అభిషేక్ శర్మ తనను క్షమించాలని కోరాడు. నువ్వు తోపు ప్లేయర్ అని నిరూపితం అయింది అంటూ వ్యాఖ్యానించాడు మహమ్మద్ అమీర్. అయితే జింబాబ్వే పై గెలిచిన టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లడం కష్టమే అంటూ మరో బాంబు పేల్చాడు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, టీమిండియా సెమీఫైనల్ లో అడుగుపెట్టబోదని వ్యాఖ్యానించాడు. కాగా జింబాబ్వేపై 30 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు అభిషేక్ శర్మ. 183.33 స్ట్రైక్ రేట్‌తో 55 పరుగులు చేశాడు.

Advertisement

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×